Duvvada Srinivas New Business: వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి దంపతులు కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టేశారు. మాధురికీ ఎంతో ఇష్టమైన వస్త్ర వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలోని ఓ భవనం తీసుకుని ‘కాంచీపురం వకులా శిల్క్స్’ పేరుతో షాపు ఆదివారం ప్రారంభించారు.
దువ్వాడ కొత్త వ్యాపారం
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కి చెందిన పలువురు హాజరయ్యారు. ఈ షాపుకు దువ్వాడ శ్రీనివాస్-మాధురి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దివ్వెల మాధురినే తన షో రూం చీరలకు బ్రాండింగ్ చేయనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ చూపు వ్యాపారంపై పడింది. రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు.
తొలుత రాజకీయాలకు దూరంగా ఉండి విశాఖలో బిజినెస్ చేయాలని ప్లాన్ చేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌కు శ్రీనివాస్-మాధురి దంపతులు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వస్త్ర దుకాణం పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ షాపుకు అవసరమైన పెట్టుబడి ఎవరు పెట్టారన్నది సీక్రెట్. దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసి షాపు ఏర్పాటు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
కేవలం సోషల్ మీడియా ద్వారానే తాము ప్రచారం చేశామన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తెలంగాణ నుంచి తనకు వస్తున్న ఆదరణ, సపోర్టు వస్త్ర రంగంలోకి అడుగుపెట్టామన్నారు. తొలి బ్రాంచ్ మియాపూర్‌లోని మదీనాగూడలో ప్రారంభించారు. మరో ఆరు బ్రాంచ్‌లు ప్రారంభించాలన్నది దువ్వాడ శ్రీనివాస్ మనసులోని మాట.
ALSO READ: శుభవార్త, యువతకు మూడు లక్షల రుణసాయం
వ్యాపారం విస్తరణపై
దీనికితోడు గోల్డ్ షాపు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. సోషల్ మీడయా ద్వారా ఇచ్చిన పిలుపు వేలాది మంది వచ్చారన్నారు. వస్త్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో చాలా షాపులు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయన్నారు. కస్టమర్ల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ధ్యేయంగా చెప్పారు.
పట్టు సిల్క్ ఎక్కడైతే అక్కడకు వెళ్లి తయారీదారులతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం చాలా షాపుల్లో వినియోగదారులకు సరై న్యాయం జరగలేదన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నట్లు వెల్లడించారు వారికి న్యాయం జరిగేలా అందుబాటులో ధరలు, క్వాలిటీయే మా ప్రయార్టీ అని చెప్పుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే కస్టమర్ల కళ్లలో ఆనందం చూడాలన్నదే మా ధ్యేయమన్నారు.
మాధురి గురించి కూడా
పనిలోపనిగా తన శ్రీమతి మాధురి గురించి మనసులోని మాట బయటపెట్టారు శ్రీనివాస్. మాధురి స్వతహాగా టాలెంట్ ఉన్న వ్యక్తని, బిజినెస్‌లో రాణించాలన్నదే ఆమె కోరిక, ఆలోచన అని తెలిపారు. వస్త్ర వ్యాపార రంగంలో రాణించాలన్నదే ఆమె ఆలోచనగా చెప్పుకొచ్చారు. వ్యాపారం- రాజకీయాలు రెండంటినీ బ్యాలెన్స్ చేస్తానన్నారు. వారంలో మూడు రోజులు అక్కడ.. మరో మూడు రోజులు ఇక్కడే ఉంటానన్నారు.
జగన్‌ను సీఎం చేయాలన్నదే తన ధ్యేయమని వెల్లడించారు. వ్యాపారం వేరు, రాజకీయం వేరన్నారు. అందరితో మాకు సంబంధాలు ఉండాలన్నారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్‌పై ఏపీలో పలు కేసులు నమోదు అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగింది.
వరుసగా ఆయనపై కేసులు నమోదు కావడంతో సైలెంట్ అయ్యారు. మండలిలోనూ పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. మామూలుగా అయితే మీడియా ముందుకు వచ్చేవారు. చివరకు వాటికి సైతం ఆయన దూరంగా ఉన్నారు. మొత్తానికి మరో నాలుగేళ్లు దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ బిజినెస్ లో ఉండడం ఖాయమన్నమాట.