BigTV English

Cancer: మీ వంటగదిలో ఉండే.. ఈ వస్తువుల వల్ల క్యాన్సర్‌ వస్తుంది తెలుసా ?

Cancer: మీ వంటగదిలో ఉండే.. ఈ వస్తువుల వల్ల క్యాన్సర్‌ వస్తుంది తెలుసా ?

Cancer: ప్రతి ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైనది. ఇక్కడి వండే వంటలే మనం ఆహారం రూపంలో తీసుకుని అవసరమైన శక్తిని పొందుతాము. సాధరణంగా వంటగదిలో ఉండే చాలా రకాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతుంటారు. కానీ కాలక్రమేణా.. ఇదే వంటగది క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులకు నిలయంగా మారుతుందని మీకు తెలుసా ? కొన్ని అధ్యయనాలలో.. ఆరోగ్య నిపుణులు మన వంటగదిలో వాడే వస్తువులు, ఆహార పదార్థాలు అధికంగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.


మీ వంటగదిలో కూడా ఇలాంటివి ఉండి.. మీరు వాటిని ఉపయోగిస్తుంటే గనక ఇకనుండయినా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా క్యాన్సర్ బాధితురాలిగా మారే ప్రమాదం ఉంది. ఏ ఏ వస్తువులు క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. ఏ పదార్థాలకు దూరంగా ఉండాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వంట చేయడానికి ఉపయోగించే కొన్ని పాత్రల నుండి వంటగదిలో ఉపయోగించే అనేక వస్తువుల వరకు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న అంశాలను పరిశోధకులు గుర్తించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణానికి కారణమయ్యే ఈ వ్యాధి ఏడాదికేడాది పెరుగుతోందని, దీని కారణంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


నాన్-స్టిక్ పాత్రల వాడకం:
వంటగదిలో ఉపయోగించే నాన్-స్టిక్ వంట సామాగ్రి ఆరోగ్యానికి హానికరమని అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాంటి పాత్రలలో నాన్-స్టిక్ పూతను తయారు చేయడానికి ఉపయోగించే పెర్ఫ్లోరోక్టానాయిక్ ఆమ్లం (PFOA) ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. PFOA దీర్ఘకాలికంగా క్యాన్సర్ ప్రమాదాలను కలిగిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆహారాన్ని వండేటప్పుడు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు, హాని కరమైన రసాయనాలు విడుదలవుతాయి. అవి మనకు కనిపించకపోవచ్చు కానీ శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. ఈ రసాయనాలు ఆహారంలోకి చేరతాయి . ఇది హార్మోన్ల సమస్యలను కలిగిస్తుందని.. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, అంతే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మీరు ప్లాస్టిక్ వస్తువులు కూడా వాడరు కదా ?

మీరు కూడా వంటగది ప్లాస్టిక్ పాత్రలు, సీసాలు, పాత్రలు లేదా టిఫిన్లు వాడుతున్నారా ? అవును అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడంలో బిస్ ఫినాల్ ఎ (BPA) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. బిస్ ఫినాల్-ఎ (BPA) అనేది ప్లాస్టిక్‌ల తయారీలో ఉపయోగించే రసాయనం. ఆహార పాత్రలు, పాల సీసాలు , ప్లాస్టిక్ నీటి సీసాలు కూడా దీనితో తయారు చేస్తారు.

ఇది మెదడు అభివృద్ధి, థైరాయిడ్ హార్మోన్లు , పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంతే కాకుండా ఈ రసాయనం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది.

ప్లాస్టిక్ వస్తువులు శరీరంలో హానికరమైన రసాయనాలను పెంచుతున్నాయి. వీటి వల్ల సంతానోత్పత్తి, మెదడు రెండూ బలహీనపడతాయి. ప్రతిరోజూ వాడకూడని వంటగది వస్తువులు క్యాన్సర్ ప్రమాదాలకు కారణం కావచ్చు. నాన్ స్టిక్ పాన్ ప్లాస్టిక్ క్యాన్సర్ కు కారణమవుతుంది.

Also Read: బ్లాక్ కాఫీ తాగితే.. మతిపోయే లాభాలు తెలుసా ?

నేటి బిజీ లైఫ్‌‌లో ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకం కూడా పెరుగుతోంది. ఈ పదార్థాలు తక్షణమే తినడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ.. ఇందులో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్స్ , ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మీరు వీటిని తరచుగా తింటే.. మాత్రం గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల బారి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×