Eatela rajender : తెలంగాణను అప్పుల కుప్పగా మర్చి, తాగుడులో, దోపిడీలో, ప్రజలకు మాయమాటలు చెప్పడంలో కెసిఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో ప్రతి మనిషి మీద లక్ష రూపాయల అప్పు ఉందని ఘాటుగా టీఆరెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
జనగామ జిల్లా లింగలఘనపూర్ మండలకేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా, గ్రామ స్థాయి నాయకులతో కలిసి వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని, గ్రామాల్లో సర్వే చేస్తే తాగడం తిండిలా సాధారణం అయ్యిందని తేలిందన్నారు భర్త తాగి మరణిస్తే వితంతువు ఫించన్ ఇస్తున్నాడే తప్ప ఆ కుటుంబానికి భరోసా లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడనుందని అన్నారు ఈటెల రాజేందర్.