BigTV English

 Rohit-Kohli career : రోహిత్, కొహ్లీ భవితవ్యం తేలేది నేడే!  

 Rohit-Kohli career : రోహిత్, కొహ్లీ భవితవ్యం తేలేది నేడే!  
Rohit-Kohli career

Rohit-Kohli career : సౌతాఫ్రికా జట్టుని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ నేడు ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో అందరిలో ఒకటే టెన్షన్ . టీమ్ ఇండియాలో కుడి, ఎడమ రెండు పిల్లర్లలా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను టీ 20 ప్రపంచకప్ నకు సెలక్ట్ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ కి తెరపడేలాగే ఉంది.


మరో ఆరు నెలల్లోనే పొట్టి కప్పు ప్రారంభం కానుంది. అందులో వీరిద్దరూ ఆడాలని అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. వీరక్కడ ఆడాలంటే ఇప్పుడు సౌతాఫ్రికా టూర్ వెళ్లే వారి లిస్టులో వీరి పేర్లు ఉండాలి.
మరి ఉంటాయా? లేవా? అనేది వేచి చూడాల్సిందే. విరాట్ కొహ్లీ టీ20, వన్డేల్లో లేకపోయినా టెస్ట్ మ్యాచ్ లకైనా ఉంటాడని అంటున్నారు. రోహిత్ శర్మ మాత్రం మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉంచాలని చూస్తున్నారు.

ఎందుకంటే హెడ్ కోచ్ గా మళ్లీ రాహుల్ ద్రవిడ్ వచ్చాడు. తనకి-రోహిత్ కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అందువల్ల ద్రవిడ్ మళ్లీ కొత్త కెప్టెన్ తో కలిసి నడవాలంటే కొంత టైమ్ పడుతుంది. తన దారిలోకి అతన్ని తెచ్చుకోవాలి. లేదా తనే అతని దారిలోకి వెళ్లి, తనకి నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకోవాలి. ఇదొక పెద్ద టాస్క్ కింద ద్రవిడ్ కి మారుతుంది. మరో ఆరునెలల్లో పొట్టి ప్రపంచ కప్ పెట్టుకుని ఈ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్లలేడు. అది ప్రమాదం.


అందుకే ద్రవిడ్ కూడా రోహిత్ శర్మవైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అలాగే బీసీసీఐ వీరి ముగ్గురిని అంటే ద్రవిడ్, విరాట్, రోహిత్ లను మరికొంత కాలం వదులుకోదని అంటున్నారు. రెండోది కొహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సూర్య ఆసిస్ తో మూడే టీ 20 మ్యాచ్ లో  డెత్ ఓవర్లలో క్లోజ్ ఫీల్డింగ్ పెట్టి బాల్స్  వేయించడం వల్ల ఫోర్లు, సిక్స్ లు వెళ్లాయని, అదే ఆరుగురిని బౌండరీల దగ్గర పెట్టుంటే మ్యాక్స్ వెల్, వేడ్ అక్కడ దొరికేవారని అంటున్నారు. అలాగే 19వ ఓవర్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కి ఇచ్చి పొరపాటు చేశాడని కూడా అంటున్నారు.

అందువల్ల సూర్య కూడా డౌటే అంటున్నారు…ఇవన్నీ కాదు… కేఎల్ రాహుల్ ని పిలిచి మొత్తం మూడు ఫార్మాట్లకి కెప్టెన్ చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏం జరిగినా బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఆ రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×