BigTV English
Advertisement

ED : ఏపీపై ఈడీ ఫోకస్.. ఆ స్కామ్ లో 26 మందికి నోటీసులు..

ED : ఏపీపై ఈడీ ఫోకస్.. ఆ స్కామ్ లో 26 మందికి నోటీసులు..

ED: తెలుగు రాష్ట్రాలపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో వివిధ కేసుల్లో దాడులు చేసిన ఈడీ అధికారులు ..ఇప్పుడు ఏపీపై దృష్టిపెట్టారు. టీడీపీ హయాంలో జరిగిన స్కామ్ పై దర్యాప్తు ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. అప్పటి ప్రభుత్వంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది.


ఇదీ కేసు నేపథ్యం
చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్యకాలంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ సంస్థతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూ.3,350 కోట్ల ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు. ఇందులో రూ.241 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ విషయం నిర్ధారణ అయింది. దీంతో ఈ స్కామ్ లో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పలు షెల్‌ కంపెనీల ద్వారా నిందితులు నిధులను దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో స్కిల్ డెవలప్ మెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావు, ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఓఎస్‌డీ కృష్ణప్రసాద్‌కు నోటీసులు ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

తెలంగాణలో ముప్పేట దాడి
కొన్నిరోజుల క్రితం తెలంగాణలో అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఈడీ దాడులు జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ సంస్థల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. చికోటీ ప్రవీణ్ క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను ఈడీ అధికారులు విచారించారు. అదే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణను విచారణకు పిలిచారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. తాజాగా ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఇలా తెలంగాణలో ఈడీ, సీబీఐ, ఐటీ ముప్పేట దాడులతో గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


ఏపీపై ఫోకస్
ఇటు ఏపీలో తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాంకు భూముల వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కలకలం రేపింది. ఇప్పుడు ఈడీ టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులకు నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంకా సీబీఐ రంగంలోకి దిగలేదు. మరి ఈ మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంకా ఏ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తాయనే ఉత్కంఠ నెలకొంది. ఇంకాఎవరెవరిని విచారణకు పిలుస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసు దర్యాప్తు ముందుకెళితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద ఏపీలో అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో కేంద్రం దర్యాప్తు సంస్థలు రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×