Big Stories

TSPSC : పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ..

TSPSC Paper Leak Case : పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. వారి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది.

- Advertisement -

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ భావిస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానిస్తోంది. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని కోరింది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఈడీ ప్రశ్నించనుంది.

- Advertisement -

మరోవైపు TSPSC కేసులో సిట్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ కేసును సిట్ అధికారులు నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 150 మందిని విచారించారు. 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని కీలక సమాచారం సేకరించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డి వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుల పెన్‌డ్రైవ్, మొబైళ్లలో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదిక ఈ కేసులో కీలక కానుంది. ఆ వివరాలను సిట్ హైకోర్టుకు సమర్పిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News