BigTV English

ED: ఈడీ రాక్స్.. 2 స్టేట్స్ షేక్స్..

ED: ఈడీ రాక్స్.. 2 స్టేట్స్ షేక్స్..

ED: ఈడీ వదల బొమ్మళీ అంటోంది. డే బై డే విచారణ చేస్తోంది. ఏ మాత్రం రెస్ట్ లేదు. అసలేమాత్రం రిలాక్స్ లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాంచి దూకుడు మీదుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ.. మరిన్ని బిగ్ ఫిష్‌ల వేటలో బిజీగా ఉంది.


ఎమ్మెల్సీ కవిత. ఈడీ బిగ్ టార్గెట్. ఇప్పటికే ఓసారి సుదీర్ఘంగా విచారించింది. 16న మళ్లీ రమ్మని పిలిచింది. టాస్ట్ మినిట్‌లో కవిత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను రాలేనంటూ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వస్తానంటూ.. ఈడీకి మెయిల్ చేసి.. తన ప్రతినిధిగా లాయర్‌ను పంపించి దర్యాప్తు సంస్థ అడిగిన పత్రాలు అందజేసింది. చివర్లో కవిత హ్యాండ్ ఇవ్వడంతో.. ఈడీ షాకైనా వెంటనే తేరుకుంది. అలాగైతే ఈ నెల 20న విచారణకు రావాలంటూ మళ్లీ ఫ్రెష్‌గా నోటీసులు పంపించింది.

సుప్రీంలో కవిత పిటిషన్ విచారణ ఈ నెల 24న జరగనుంది. అంతకుముందే 20నే ఈడీ రమ్మంది. అంటే.. కవిత డిమాండ్‌కు ఈడీ తలొగ్గలేదనే అంటున్నారు. మరి, 20న అయినా కవిత వెళ్తారా? ఆమె రాకపోతే అరెస్ట్ చేస్తారా? మరో ఛాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.


కవిత కోసం ఈడీ పక్కాగా ప్లాన్ చేసినట్టుంది. ఆమెకు బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గురువారం ముగిసింది. అయితే, పిళ్లైని కవితని ఎదురెదురుగా ఉంచి విచారించాలంటూ స్పెషల్ కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ కేసులో కవిత అనుమానితురాలని.. అందుకే రామచంద్ర పిళ్లై కస్టడీని మరో 5 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందరినీ ఒకేసారి విచారించాల్సిన అవసరం ఏముందని ఈడీని ప్రశ్నించింది. డాక్యుమెంట్లు చూపించి విచారించొచ్చుగా అంటూ వ్యాఖ్యానించింది. పిళ్లైని ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు.

ఇక్కడే మరో ట్విస్ట్. కవితను ఈ నెల 20న విచారణకు పిలిచింది ఈడీ. పిళ్లైకి సైతం ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అంటే, 20న కవిత విచారణకు వస్తే.. పిళ్లైని ఎదురుగా ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈడీ దర్యాప్తు అటు ఏపీలోని అధికార వైసీపీనీ షేక్ చేసేలా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 18న విచారణకు రావాలంటూ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఇదే కేసులో శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా.. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ కేసులో శ్రీనివాసులరెడ్డి ప్రమేయం కూడా ఉందని భావిస్తుండటంతో ఆయనకూ ఈడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దాదాపు కొలిక్కి వచ్చిందని స్పెషల్ కోర్టుకు తెలిపింది ఈడీ. కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డిలను ప్రశ్నించడం పూర్తైతే.. ఇక కేసు విచారణ ముగిసినట్టేనని కోర్టుకు వెల్లడించింది. అంటే, లిక్కర్ స్కాం కేసు క్లైమాక్స్‌కు చేరినట్టేనా? కవిత, మాగుంటల అరెస్ట్‌తో ఎండ్ అవుతుందా? ఇలా, ఈడీ దూకుడుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. అధికార పార్టీల్లో ఆందోళన పెరిగింది.

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

Crazey Foods : ఆ ఆహార పదార్థాలకు యువతలో పెరుగుతున్న క్రేజ్..

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×