E-Paper
Advertisement

Rahul Gandhi : కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ.. సభలోనే బదులిస్తా: రాహుల్ గాంధీ ‌

Rahul Gandhi : కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ.. సభలోనే బదులిస్తా: రాహుల్ గాంధీ ‌
Advertisement

Rahul Gandhi : భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. వరసగా నాలుగో రోజు సభలో గందరగోళం ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో అలజడి రేగింది. విదేశాల్లో మన దేశాన్ని తక్కువ చేసేలా రాహుల్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదని కాషాయ సభ్యులు విరుచుకుపడ్డారు. విదేశీ పర్యటన తర్వాత భారత్‌కు చేరుకున్న రాహుల్‌.. గురువారం పార్లమెంట్‌కు వచ్చి ఈ వివాదంపై స్పందిస్తారని తొలుత వార్తలు వచ్చాయి.

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు రాహుల్‌పై విమర్శలు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా స్వదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తి.. విదేశాలకు వెళ్లి తనకు మాట్లాడే స్వేచ్ఛ లేదని ఎలా చెబుతారని నిలదీశారు. కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీనే ముంచేస్తున్నారని.. కానీ దేశానికి హాని చేయాలని ప్రయత్నిస్తే తాము నిశ్శబ్దంగా ఉండబోమని కిరణ్‌ రిజిజు విరుచుకుపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అయితే రాహుల్ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఇదివరకే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే సభా కార్యకలాపాలు జరగకుండా అధికార పక్షం వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌, విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

Advertisement

కేంబ్రిడ్జ్ ప్రసంగం ఇష్యూపై రాహుల్ గాంధీ స్పందించారు. తానెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తనను అనుమతిస్తే సభలో మాట్లాడతానని తేల్చిచెప్పారు. అవకాశం ఇవ్వకపోతే పార్లమెంట్‌ బయట మాట్లాడతానన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×