BigTV English

Egg Price: కొండెక్కిన కోడిగుడ్డు.. సెంచరీకి చేరువలో డజన్..

Egg Price: కొండెక్కిన కోడిగుడ్డు.. సెంచరీకి చేరువలో డజన్..

Egg Price: వారాంతం వచ్చిందంటే.. నాన్ వెజ్ ఉండాల్సిందే. ముక్కలేకపోతే ముద్దదిగని నాన్ వెజ్ ప్రియులెందరో ఉన్నారు. కార్తీకమాసం పూర్తయిందో లేదో.. చికెన్ ధరలు పెరిగిపోయాయి. మటన్ సంగతైతే చెప్పనక్కర్లేదు. సామాన్యుడు ఆ వైపు చూస్తే.. జేబుకు చిల్లుపడినట్లే. చికెన్ కూడా కొనలేని వారు.. కోడిగుడ్లనే నాన్ వెజ్ గా తింటారు. ఇప్పుడు వాటి ధరలు కూడా అకస్మాత్తుగా పెరిగిపోయాయి.


గతంలో డజన్ కోడిగుడ్ల ధర రూ.66 ఉంటే.. ఇప్పుడు రూ.84కు పెరిగింది. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7 పలుకుతోందనమాట. కోడిగుడ్లలో ప్రొటీన్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతిరోజూ వీటిని తింటుంటారు. వారంరోజుల్లోనే డజన్ కోడిగుడ్లపై రూ.18 రూపాయలు పెరగడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కోడిగుడ్ల ధర అమాంతం పెరగడానికి కారణం.. కోళ్ల దాణా ధరలు పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు. కిలో రూ.15-రూ.17 వరకు ఉంటే.. ఇప్పుడు కిలో దాణా ధర రూ.28కి పెరిగింది. దాణా ఖర్చులు పెరగడంతోనే గుడ్డు ధరలను పెంచాల్సి వచ్చిందని కోళ్ల ఫారాల నిర్వాహకులు తెలిపారు. దాణా ధరల పెరుగుదల, డిమాండ్ కు తగిన గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచినట్లు వివరించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×