E-Paper
Advertisement

Election Campaigning Close : మైకులు బంద్.. తెలంగాణలో 48 గంటల పాటు ఎన్నికల ఆంక్షలు..

Election Campaigning Close : మైకులు బంద్.. తెలంగాణలో 48 గంటల పాటు ఎన్నికల ఆంక్షలు..
Advertisement
cm election updates in telangana

Election Campaigning Close(CM election updates in telangana) :

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్ర 5 గంటలకు మైకులు బంద్ అయ్యాయి. పార్టీలన్నీ ప్రచారానికి గుడ్ బై చెప్పి.. పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టాయి. తెలంగాణలోని
13 సమస్యాత్మక నియోజకవర్గాల్లోసాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది. సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలో గంట ముందే ప్రచారం ముగిసింది.

తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 30న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు క్యూలైన్ లో ఉన్న వారిని ఓటింగ్ కు అనుమతిస్తారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి.

Advertisement

మరోవైపు పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి హైదరాబాద్‌లో ఆంక్షలు విధించామని హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య తెలిపారు. డిసెంబర్ 1 ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటంపై నిషేధం విధించారు. కర్రలు, జెండాలు, తుపాకులు లాంటి ఆయుధాలతో సంచరించడం నిషేధమని స్పష్టం చేశారు.


హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్‌ దూరంలో సమావేశాలు నిర్వహించడం కుదరదన్నారు. ఆ ప్రాంతంలో గుంపుగా సంచరించడంపై నిషేధం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామీనాలు వేయడంపై ఆంక్షలు పెట్టారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×