Big Stories

Flamingo : అర్జెంటీనాలో బర్డ్ ఫ్లూ.. 220 ఫ్లెమింగోల మృత్యువాత

Flamingo

Flamingo : అర్జెంటీనా వాయవ్య ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ ప్రబలింది. ఫలితంగా 220 వరకు ఫ్లెమింగో పక్షులు మ‌ృత్యువాత పడ్డాయి. మరణించిన ఎర్రని కొంగలు జేమ్స్ ఫ్లెమింగో జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా అర్జెంటీనా, బొలీవియా, చిలీ, పెరూ దేశాల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తుంటాయి.

- Advertisement -

దక్షిణ అమెరికా అంతటా ప్రస్తుతం ఏవియన్ ప్లూ వైరస్ స్ట్రెయిన్ H5N1 వ్యాప్తిలో ఉంది. రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ అన్ని పక్షులకు సంక్రమించే ప్రమాదం ఉంది. మనుషులకూ వ్యాప్తి చెందొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో బర్డ్ ఫ్లూ కారణంగా అట్లాంటిక్ తీరంలో 50కి పైగా సీ లయన్స్ మృతి చెందాయి. అంతకుముందు చిలీ, పెరూ దేశాల్లో వేల సంఖ్యలో సీలయన్స్ మృత్యువాత పడ్డాయి.

- Advertisement -

కెటమర్కా ప్రావిన్స్‌లో చనిపోయిన ఫ్లెమింగోలను పరీక్షించి చూడగా.. ఏవియన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృతి చెందిన ఏ జంతువులనూ తాకొద్దని పర్యాటకులను హెచ్చరించారు.

ఈ జాతి ఫ్లెమింగోలు అంతరిస్తున్న ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఈ ఎర్రని కొంగలు అందరికీ తెలిసినవే అయినా.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లో ఆరు జాతులు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో నాలుగు జాతులు, మిగిలిన రెండు జాతులు ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల్లో కనిపిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News