E-Paper
Advertisement

Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!

Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి..  రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!
Advertisement

Errolla Srinivas:  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లన్ని డెత్ డిక్లరేషన్ లు అయ్యాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చిన తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ నట్టెట ముంచారన్నారు. ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చాడన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడనీ విద్యార్థులను , నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మొహం చూసే కదా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మలేదన్నారు. హైదరాబాద్, వరంగల్, కామారెడ్డి చేవెళ్ల డిక్లరేషన్ ల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండా? అని ప్రశ్నించారు.

Also Read: Huzurabad News: మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం

Advertisement

భరోసా పేరుతో తెలంగాణ ప్రజలకు భరోసా లేకుండా చేశారన్నారు. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే నిరుద్యోగుల పై లాఠీఛార్జ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని, విద్యా భరోసా కింద విద్యార్థులకు 5 లక్షల ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అక్రమ కేసులు, నిర్బంధాలే కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో ఇంతియాజ్ అహ్మద్ ,గాంధీ నాయక్ ,బొమ్మెర రామమూర్తి ,ఫయాజ్ పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×