BigTV English

Cock Fight : పేకాట..గుండాట.. బెట్టింగులు.. కోడి పందేలు..

Cock Fight : పేకాట..గుండాట.. బెట్టింగులు.. కోడి పందేలు..
Advertisement

Cock Fight : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి హడావిడి కొనసాగుతుంది. కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, నెంబర్ గేమ్‌లు అంటూ పందెం రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఈ క్రమం లోనే గడిచిన రెండు రోజుల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. పేకాట, గుండాటలో సైతం కోట్లలో బెట్టింగులు పెట్టారు. ఇక ఈరోజు పండుగ చివరి రోజు కావడంతో.. ఇవాళ కూడా కోట్లలో బెట్టింగ్ లు జరుగుతాయని భావిస్తున్నారు.


మరోవైపు బరుల వద్ద హైటెక్‌ హంగులతో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పందాలకు ఉత్సవాలను తలపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. అలానే కోడిపందాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు, మద్యం, తినుబండారాల స్టాల్స్ విరివిగా కనిపిస్తున్నాయి. ఈ పందెలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు క్యూ కడుతున్నారు.

ఇక పందాలు చూసేందుకు తరలి వచ్చే జనం కోసం కూడా ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. నారాయణపురంలో పందెం బరి దగ్గర వెయ్యి రూపాయల కూపన్ కొంటే లాటరీలో రెండు బైకులు గెలుచుకునే ఆఫర్ ఏర్పాటు చేశారు. దీంతో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చేస్తున్నారు. పందెలు చూడడానికి వచ్చేవారికి సైతం టికెట్లు నిర్ణయించి విక్రయిస్తుండటంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి.


Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×