BigTV English

Kaleshwaram Project : కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆరే! – మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు

Kaleshwaram Project : కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆరే! – మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు

Kaleshwaram Project :


⦿ కాళేశ్వరం డీపీఆర్ ఫైనల్ చేసింది ఆయనే
⦿ బ్యారేజీల్లో నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే
⦿ ఇంజనీర్ల పనులూ ఆయనే చేశారు
⦿ పలు కీలక రికార్డులిచ్చిన మాజీ ఈఎన్సీ
⦿ నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ కుంగుబాటు
⦿ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు వాంగ్మూలం

హైదరాబాద్, స్వేచ్ఛ: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ క్రమంలో గతంలో రెండు సార్లు విచారణకు హాజరైన విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మరోసారి కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా, కాళేశ్వరం డీపీఆర్‌ను అధికారులకు బదులు నాటి సీఎం కేసీఆర్‌ ఆమోదించినట్లు విచారణలో వెంకటేశ్వర్లు కమిషన్‌ ముందు అంగీకరించటమే గాక దీని దస్త్రాలను కమిషన్‌కు అందించారు.


అన్నీ ఆదేశాలే..
సాధారణంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్ల అంచనాలు, ఆలోచనల మేరకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రూపొందించి, తుది చర్చల తర్వాత ఆమోదిస్తారని, కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన అంతా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే జరిగిందని వెంకటేశ్వర్లు కమిషన్ ముందు వెల్లడించారు. అలాగే కాళేశ్వరం డిజైన్లను ఫైనల్ చేయాలని కేసీఆర్ తమను ఆదేశించారని, ఆయన ఆదేశాలను పాటించటం తప్ప నాటి అధికారులకు మరోదారి లేకపోయిందని ఆయన కమిషన్ ముందు వాపోయారు. దీనికి రుజువుగా అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్లు, జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాల డాక్యుమెంట్లు, నాటి సమావేశాల మినిట్స్‌కు సంబంధించిన రికార్డులను, మూడు బ్యారేజీల వివరాలను ఆయన కమిషన్‌కు అందజేశారు.

ఆయన మాటే వేదం
అనంతరం ‘మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపాలే కారణమా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నింపమని చెప్పింది ఎవరు? అని కమిషన్ వెంకటేశ్వర్లును ప్రశ్నించింది. నాటి ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకే తాము బ్యారేజీల్లో నీరు నింపామని వెంకటేశ్వర్లు కమిషన్‌ ముందు వెల్లడించారు. మేడిగడ్డ 7వ గేట్ కుంగుబాటుకు ఆపరేషన్, మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడమే కారణమని ఆయన కమిషన్‌ ముందు అంగీకరించారు.

మరాఠీ రైతుల మొర
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం విషయంలో నాటి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ మహరాష్ట్ర రైతులు పీసీ ఘోష్ కమిషన్‌కు లేఖలు రాశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని సుమారు 10 గ్రామాలలో భూసేకరణ చేశారని, అయితే, నిర్మాణం చేపట్టక ముందే సర్వే చేపట్టిన అధికారులు ఇక్కడ తప్పుడు నివేదికలు ఇచ్చారని రైతులు తమ లేఖలో వాపోయారు. తొలుత 378.2 హెక్టార్లు మాత్రమే సరిపోతుందని చెప్పిన అధికారులు బ్యారేజీ కట్టిన తర్వాత మరో 500 హెక్టార్ల భూమి మునుగుతుందని చెప్పారని వారు వారు వాపోయారు. దీనిపై తాము ఆందోళన చేస్తే, అధికారులు సర్వే చేశారు తప్ప నోటిఫై చేయించలేదన్నారు. ఈ భూమినే నమ్ముకున్న తమకు దీనివల్ల ఉపాధిలేకుండా పోతోందని, తమకు న్యాయం చేయాలని వారు ఘోష్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ALSO READ :  మోమోస్ తిని మహిళ మృతి.. మరో 50మందికి అస్వస్థత

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×