Big Stories

Tamilisai stay in Hyderabad: తెలంగాణాలో తమిళిసై, ఈసారి ఆ బాధ్యతలు..

Tamilisai soundararajan latest news(TS today news): మాజీ గవర్నర్ తమిళిసై మళ్లీ తెలంగాణకు వచ్చేశారు. రెండువారాల పాటు ఆమె హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈసారి ఆమెని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యేవరకు ఆమె హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.

- Advertisement -

అంతేకాదు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో నిమగ్నకానున్నారు. ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా తమిళిసైను రప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. చాలామంది తమిళ ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ ఎంపీ అయితే గెలుపొందుతారో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నది నేతల భావన. అందుకోసమే తమిళిసై తమిళనాడు నుంచి రప్పించారని అంటున్నారు.

- Advertisement -

మాజీ గవర్నర్ తమిళి సై తమిళనాడు సౌత్ చెన్నై నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తొలి దశ పోలింగ్‌లో ఆమె నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అయితే మంత్రి కిషన్‌రెడ్డి మేరకు ఆమెను సికింద్రాబాద్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారన్నది బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలు గెలవబోతున్నారని, అలాగే ఎక్కువమంది కేంద్రమంత్రులు అయ్యే ఛాన్స్ ఉందని ఆమె చెబుతున్నమాట. ఎన్నికల ప్రచారం ద్వారా ఎక్కువ మంది ప్రజలను కలిసే ఛాన్స్ ఉందని మనసులోని మాట బయటపెట్టారు.

తమిళి‌సై హైదరాబాద్‌కు రావడంతో రాజకీయ నేతల్లో చర్చ మొదలైంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆమె గవర్నర్‌గా పని చేశారు. బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే తమిళిసై కరెక్ట్ అని భావించి ప్రత్యేకంగా సికింద్రాబాద్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. మరి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ గురించి ఆమె ఇంకెన్ని విషయాలు బయటపెడతారేమోనని చర్చించుకోవడం నేతల వంతైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News