E-Paper
Advertisement

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
Advertisement

CM Revanth Reddy: పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లు ఈ లేఖ రాశారు. విద్యారంగ ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారు చర్చించారు. ఇది వరకు కాంగ్రెస్ ప్రకటించిన విధానాలు, హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, విస్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గత బీఆర్ఎష్ ప్రభుత్వమే 10468 పండిత, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు అన్ని అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు సీఎం నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనేవారిలో మెజార్టీగా వీరే ఉన్నారని గమనించాల్సిందిగా సూచిస్తున్నామని వారు బహిరంగ లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కాళేశ్వరం జోన్ 1లో తమ ప్రభుత్వమే 1050 గెజిటెడ్ ప్రధానోపాధ్య ప్రమోషన్లను ఇచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వం 10000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికీ పాఠశాలలకు కేటాయించలేదని విమర్శించారు.

Advertisement

Also Read: ఇదేమైనా సినిమా షూటింగ్ హా.. హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఫైర్

కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గొప్పగా పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో విస్పష్టంగా ప్రకటించాలని, వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు అనుమతిస్తారో కూడా సభలో ప్రకటిస్తే సంతోషమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఓల్డ్ పెన్షన్ స్కీం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలకు స్కావెంజర్స్ అనుమతిస్తామని ఇప్పటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, మధ్యాహ్నం భోజన పథకం వర్కర్లకు వారి మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారాన్ని అందించే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్టు వారు లేఖలో పేర్కొన్నారు.

Tags

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×