BigTV English

Bigg Boss Remuneration:బిగ్ బాస్ లో గంగవ్వ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Bigg Boss Remuneration:బిగ్ బాస్ లో గంగవ్వ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Bigg Boss Remuneration: బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ప్రస్తుతం పదో వారంలో ఉంది.. అయితే ఈ వారం హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారా అని ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూసారు. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తుంది. కాగా, ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోవడం చూపించారు. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి అడుగుపెట్టిన గంగవ్వ బాగానే ఆడింది. టాస్క్‌ల్లో తనకు అర్థమైనంతవరకు బెస్ట్ ఇచ్చింది. అయితే, ఇటీవల గంగవ్వ ఆరోగ్యం సరిగా లేదు అందుకే బయటకు వెళ్లినట్లు తెలుస్తుంది.


వీకెండ్ ఎపిసోడ్ శనివారం నాటి ఎపిసోడ్‌లో గంగవ్వతో హోస్ట్ నాగార్జున సీక్రెట్ గా మాట్లాడాడు. అప్పుడు తన చేతులకు మంటలు పుడుతున్నాయని, ఉండాలని ఉంది కానీ, తనవల్ల కావట్లేదని, ఎక్కిళ్లు, తేర్పులు తరచుగా వస్తున్నాయని గంగవ్వ తన ఆరోగ్య సమస్య చెప్పుకుంది. అయితే, ఇంటి నుంచి వెళ్తావా గంగవ్వ అని నాగార్జున అడిగితే ఇక గంగవ్వ వెళ్తానని చెప్పాడంతో గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. గంగవ్వ బయటకు వెళ్లిపోవడంతో రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్, అవినాష్, నబీల్ ఫీల్ అయ్యారు. అవ్వతో ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా, బిగ్ బాస్ 8 తెలుగు 10వ వారం నామినేషన్స్‌లో గంగవ్వ లేదు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్‌లో యష్మీ, గౌతమ్, ప్రేరణ, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ ఏడుగురు మాత్రమే ఉన్నారు. గంగవ్వ కేవలం అనారోగ్య కారణాలతోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఆమె హౌస్ ఇన్ని రోజులు ఉన్నందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.. గంగవ్వ వారానికి రూ. 3.5 లక్షల పారితోషికం ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంటే, రోజుకు సుమారుగా రూ. 50 వేల రెమ్యునరేషన్ అందుకుంది గంగవ్వ, అలా ఐదు వారాల పాటు ఉన్న గంగవ్వ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రూ. 17 లక్షల 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇలా చూసుకుంటే హౌజ్‌లో చాలా వరకు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే గంగవ్వ బాగానే సంపాదించింది.. గతంలో వచ్చినప్పుడు కూడా బాగానే సంపాదించుకుంది.. పదిలక్షలు రావడంతో సొంత ఇల్లు కూడా కట్టుకుంది.. నాగార్జున సాయంతో ఆమె సొంతింటి కళను నెరవేర్చుకుంది.. ఇక ఈ సీజన్ లో కూడా అవ్వ ఎక్కువ రోజులు ఉండలేను అని చెప్పడంతోనే ఆమె బయటకు వెళ్ళింది  ఇక ఈరోజు హరితేజ బయటకు వెళ్లనుంది.. మరి ఈమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చూడాలి.. ఈ రోజు సెకండ్ ఎలిమినేషన్ గురించి చెప్పనున్నారు. హరి తేజా గత వారం కూడా ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి లక్ బాగుంది అందుకే సేఫ్ అయ్యింది. కానీ ఈ వారం మాత్రం ఆమె బయటకు వెళ్లక తప్పలేదు..


Tags

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×