E-Paper
Advertisement

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!
Advertisement

Fake Currency: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ చలామణిలోకి తెస్తున్న గ్యాంగును అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.78 కోట్ల విలువ చేసే నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీపీ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది వ్యక్తులు పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను కారులో తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు షాద్ నగర్ SOT సిబ్బందితో కలిసి జాతీయ రహదారి 65పై రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఇందులో భాగంగా అటుగా వచ్చిన ఓ మారుతి డిజైర్ కారును ఆపారు. తనిఖీ చెయ్యగా పెద్దమొత్తంలో ఫేక్ కరెన్సీ దొరికింది. దీనిని తరలిస్తున్న మడుపోజు కరుణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. విచారణలో నిందితులు కుంట్లూర్ ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్టు వెల్లడైంది.

Advertisement

Also Read: అయ్యబాబోయ్ అద్దంలో అరాచకం… చలికాలంలోనూ చెమటలు పట్టించే హారర్ మూవీ… స్ట్రీమింగ్ తెలుగులో

దాంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న కలర్ ప్రింటర్లు, ల్యాప్‌ టాప్, కరెన్సీ కటింగ్ మిషన్లు, డమ్మీ పిస్టల్, వాకీటాకీలు, నకిలీ పోలీస్ ఐడీ కార్డులను పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తులో నిందితులు పోలీసుల పేరుతో చలామణి అవుతూ ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ముఠాకు సంబంధించి ఇతర లింకులు, నకిలీ నోట్ల పంపిణీ నెట్‌ వర్క్‌ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Also Read: వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

Tags

Related News

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!

జలమండలికి సవాల్‌తో కూడిన మెగా ఆపరేషన్.. చకా చకా రిపేర్లు!

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించడి.. అధికారులు భట్టి విక్రమార్క ఆదేశం!

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై.. సీఎం రేవంత్ రెడ్డి హై-లెవెల్ రివ్యూ!

Big Stories

Advertisement
×