E-Paper
Advertisement

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!
Advertisement

KTR Help: ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మిని స్వదేశానికి రప్పించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు. నెల రోజుల్లోనే తల్లిని ఇంటికి తీసుకొస్తానని ఆమె కుమారుడు రాజుకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని గోకఫసల్వాడ గ్రామానికి చెందిన తుప్పుడు లక్ష్మి, భర్త వెంకటప్ప ఉపాధి కోసం ఫిబ్రవరి 27న మస్కట్‌కు వెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఏజెంట్ చెప్పిన పనికి భిన్నమైన పని అప్పగించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అంతేకాకుండా యజమాని ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను విదేశాలకు పంపించిన ఏజెంట్ కూడా ఫోన్‌కు స్పందించకుండా, తిరిగి భారత్‌కు పంపించేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు లక్ష్మి కుటుంబానికి తెలిపింది. ఈ క్రమంలో ఆమె వైఫై, సిమ్ కార్డు సేవలు కూడా నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరకు పక్కింటి వారి ఇంటర్నెట్ సహాయంతో తన కుమారుడు రాజును సంప్రదించి అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

Advertisement

Also Read: రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

తల్లి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన కుమారుడు రాజు సెప్టెంబర్ 29న కేటీఆర్‌ను కలిసి తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ నెల రోజుల్లోనే పాస్‌పోర్టు సమస్యను పరిష్కరించి తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తానని రాజుకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు లేఖ రాయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో లక్ష్మి సురక్షితంగా భారత్‌కు తిరిగి చేరుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో పేర్కొన్నారు. చేసిన సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని కేటీఆర్ కు ధన్యవాదాలు అని లక్ష్మి తెలిపారు.

Advertisement

Also Read: జగన్ సొంత ఇలాకా పులివెందులలో బిగ్ షాక్.. టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీత గెలుపు!

Tags

Related News

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించడి.. అధికారులు భట్టి విక్రమార్క ఆదేశం!

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై.. సీఎం రేవంత్ రెడ్డి హై-లెవెల్ రివ్యూ!

పదో తరగతి పాసైనా చేతికి రాని మెమో.. గద్వాల్లో స్కూల్ యాజమాన్యం వేధింపులు!

ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?

Big Stories

Advertisement
×