Pocket Rockkets Teaser: నిహారిక కొణిదెల మెగా వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే హీరోయిన్ గా సక్సెస్ కానీ నేపథ్యంలో నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్స్(Pinka Elephant Picture Banner) స్థాపించి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నిర్మాతగా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుంటున్నారు. ఇక త్వరలోనే నిహారిక(Niharika) పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్ల పై సంయుక్తంగా తెరుకెక్కిన చిత్రం పాకెట్ రాకెట్స్.
ఈ సినిమా ద్వారా రుద్ర అత్రి దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. కమిటీ కుర్రాళ్ళు చిత్రం నటుడు త్రినాథ్ వర్మ, శ్రీయా కొంతం హీరో హీరోయిన్లుగా తెరికెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఇక ఈ టీజర్ వీడియో చూస్తుంటే మాత్రం సినిమా కథ మొత్తం క్యాసినో గ్యాంబ్లింగ్ నేపథ్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా శ్రీలంక క్యాసినో నేపథ్యంలో సాగిపోతుందని తెలుస్తోంది. ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే..
శ్రీలంకలోని ఒక రిసార్ట్ లో ఒక యువకుడు మాట్లాడుతూ ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కలకంటే రియాలిటీనే ఫస్ట్ టైం బాగుందనీ తన సంతోషం వ్యక్తం చేస్తారు. ఇంతలోనే మరో యువకుడు స్పందిస్తూ డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తి గాయ్స్.. ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ 2.2 లాక్స్ అని చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇలా శ్రీలంకలో గ్యాంబ్లింగ్ లో మునిగి తేలుతున్న యువకుడు ఈ గ్యాంబ్లింగ్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జెడి చక్రవర్తి(J.D. Chakravarthy) కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇలా పాకెట్ రాకెట్స్ టీజర్ చూస్తుంటే మాత్రం ఈ టీజర్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి. ఇలా టీజర్ వీడియోతోనే సినిమాపై నిహారిక హైప్ క్రియేట్ చేయడంతో నిహారిక ఖాతాలో మరొక హిట్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా అనంతరం ఈమె రాకాసాతో మరో హిట్ కొట్టారు ఇప్పుడు పాకెట్ రాకెట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్ తో కలిసి బరి (Bhari) సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
Also Read: సీఎం మనవడిగా పుట్టడం తప్పు.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్