E-Paper
Advertisement

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!
Advertisement

KTR LIT – 2026: యువత ఆలోచనలకు అండగా, వారి భవిష్యత్తుకు బాటగా ఎల్ఐటీ-2026 నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, యువతకు అవసరమైన నైపుణ్యాలు వంటి అంశాలపై చర్చించారు. వరంగల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను, సృజనాత్మక ఆలోచనలను, నాయకత్వ లక్షణాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన ‘జెన్ జడ్ యూత్ ఈవెంట్ ఎల్ఐటీ-2026, వై నాట్ ఇన్ వరంగల్’ కార్యక్రమం గురించి వివరించారు.

Also Read: కార్పొరేషన్లలో కూటమి ప్రభంజనం.. గుంటూరు, తిరుపతి, చిత్తూరు, మచిలీపట్నం కైవసం!

Advertisement

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేటీఆర్ విద్యార్థులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థుల ఆలోచనలను అభినందించారు. వారి సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ఎల్ఐటీ-2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, వారికి సరైన వేదిక, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరని కొనియాడారు. వరంగల్ యువ ఇంజనీర్ల ఆలోచనలకు, ఆశయాలకు ప్రతిరూపంగా నిలవనున్న ఎల్ఐటీ-2026 విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Also Read: చనిపోయిన కుక్కకు స్వర్గం నుంచి తిరిగొచ్చే ఛాన్స్‌… పగ తీర్చుకోవడానికి తిరిగొచ్చి ఏం చేసిందో తెలుసా ?

Tags

Related News

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించడి.. అధికారులు భట్టి విక్రమార్క ఆదేశం!

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై.. సీఎం రేవంత్ రెడ్డి హై-లెవెల్ రివ్యూ!

పదో తరగతి పాసైనా చేతికి రాని మెమో.. గద్వాల్లో స్కూల్ యాజమాన్యం వేధింపులు!

ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?

Big Stories

Advertisement
×