E-Paper
Advertisement

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!
Advertisement

Sabarimala Buses: స్వేచ్చ బ్యూరో: శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు టీజీఎస్‌ఆర్టీసి జహీరాబాద్ డిపో శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ రాజేశ్వరి తెలిపారు. ప్రతి ఏటా శబరిమలకు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ డిపో నుండి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

గురుస్వామి ఉచితం..

ఈ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు అనేక ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బస్సులో ఒక గురుస్వామి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇద్దరు వంట మనుషులకు సీటు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు, పదేండ్ల ల్లోపు ఇద్దరు మనికంఠ అయ్యప్పలు సీటు లేకుండా ఉచితంగా వెళ్ళవచ్చు. భక్తులకు అనుకూలంగా విశ్రాంతి, భోజనాల కోసం బస్సును ఆపుతారన్నారు.

ఇళ్ల వద్ద నుంచే బస్సు..

Advertisement

భక్తులు కోరుకున్న ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఈ టూర్‌లో చూసే వెసులుబాటు కల్పించారు. భక్తుల ఇళ్ల వద్ద నుంచే బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకొని, సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోవాలని డిపో మేనేజర్ రాజేశ్వరి కోరారు. బుకింగ్ మరియు ఇతర వివరాల కోసం 9959226269, 8309106357 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Also Read: యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

Tags

Related News

చెంగిచెర్లలో హైడ్రా హల్చల్.. రియల్ ఎస్టేట్ ముఠా దందా గుట్టు రట్టు!

జలమండలికి సవాల్‌తో కూడిన మెగా ఆపరేషన్.. చకా చకా రిపేర్లు!

కేంద్ర పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించడి.. అధికారులు భట్టి విక్రమార్క ఆదేశం!

హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.6.78 కోట్ల ఫేక్ నోట్లు గుర్తింపు.. నిందితులు అరెస్ట్!

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

Big Stories

Advertisement
×