E-Paper
Advertisement

Telangana Elections : అధికార పార్టీకి టెన్షన్.. నామినేషన్లకు సిద్ధమైన బాధితులు..

Telangana Elections : అధికార పార్టీకి టెన్షన్.. నామినేషన్లకు సిద్ధమైన బాధితులు..
Advertisement

Telangana Elections : తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ నేతలకు షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మరికొంత మంది. వివిధ ప్రాంతాలలో బాధితులు తమ ఆవేదన, ఆక్రోశాన్ని నామినేషన్ల రూపంలో బయటపెట్టేందుకు రెడీ అయ్యారు. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆయనకు కామారెడ్డి ప్రాంత రైతులు షాక్ ఇవ్వనున్నారు . సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పౌల్ట్రీ రైతులు, అమరవీరుల కుటుంబాలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తాము కేసీఆర్‌పై పోటీకి వంద నామినేషన్లు దాఖలు చేస్తామని ఇప్పటికే కామారెడ్డి ప్రాంత రైతులు ప్రకటించారు.

ఇక కోరుట్ల నియోజకవర్గంలో వంద నామినేషన్లు వేస్తామని.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామంటూ చెరుకు రైతులు అల్టిమేటం జారీ చేశారు. 2014 ఎన్నికల టైమ్‌లో అధికారం ఇస్తే.. రాష్ట్రంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను వంద రోజుల్లో స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మి రైతులందరు బీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపించారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మర్చిపోయిన కేసీఆర్.. నడుస్తున్న ఫ్యాక్టరీలను లే ఆఫ్ పేరిట మూసివేయించి వేలాది మంది రైతులు, కార్మికుల పొట్టకొట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రీజినల్‌ రింగ్‌రోడ్డు బాధిత రైతులు. భువనగిరి నియోజకవర్గంలో… అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ మార్చాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము బరిలో నిలుస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతి ట్రిపుల్ ఆర్ బాధిత రైతు ఎన్నికల బరిలో నిలువనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు నిరుద్యోగులు కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. ఈ సారి తెలంగాణలో నామినేషన్ల పర్వం ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×