BigTV English

Father – Daughter Suicide: నేను వెళ్తున్నా.. నువ్వు హ్యాపీగా ఉండు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త చివరి లేఖ

Father – Daughter Suicide: నేను వెళ్తున్నా.. నువ్వు హ్యాపీగా ఉండు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త చివరి లేఖ

Father – Daughter Suicide: నిజామాబాద్ లో తండ్రి, కూతురు ఆత్మహత్య కలకలం రేపింది. ఏడాదిన్నర కూతురితో సూసైడ్ చేసుకున్నాడు ఓ తండ్రి. అయితే సూసైడ్ కు ముందు రాసిన ఓ ఉత్తరం ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ సూసైడ్ నోట్ లో ఏముంది.. ? ముక్కుపచ్చలారని కూతురితో కలిసి తనువు చాలించాల్సినంత కష్టం ఏమొచ్చింది.. ? నిజామాబాద్‌ కూతురును చంపి తండ్రి సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌


ఏడాదిన్నర కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. చావుకు ముందు కార్తీక్ రాసిన ఈ ఉత్తరం ఇప్పుడు కుటుంబంతో పాటు స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారు జామున నిజామాబాద్ శివారులోని న్యాల్కల్ చెరువులో దూకి 35 ఏళ్ల కార్తీక్, ఏడాదిన్నర కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టి, మృత దేహాలను వెలికితీశారు. విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబసభ్యులు.

అయితే ఈ ఘటనలో సూసైడ్ లెటర్ బయటపడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యకు ముందే ఉత్తరం రాశాడు కార్తిక్. తాను చనిపోతున్నానని.. నాకు ఇలా ఉండటం నాతో అవట్లేదని.. నా కూతురును కూడా తీసుకెళుతున్నానంటూ లెటర్‌లో తెలిపాడు. మానస నీకు మంచి భవిష్యత్‌ ఉంది. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకొని మంచి భార్యగా జీవితాన్ని ప్రారంభించాలని లెటర్‌లో పేర్కొన్నాడు కార్తీక్‌. లెటర్‌లో శ్రీను అన్నకు కూడా చెప్పు అంటూ పేర్కొన్నాడు. అలాగే ఈ సూసైడ్ లెటర్ ఎవరికీ చూపొద్దని.. నిన్ను బ్లేమ్ చేయడం నాకిష్టం లేదని లెటర్‌లో కార్తీక్ పేర్కొన్నాడు. అంతేకాదు.. తాను ఫలానా చెరువులో దూకి చనిపోతున్నా అని ముందే రాసుకొచ్చాడు. రాత్రి వరకు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్న వ్యక్తి.. ఇలా చనిపోతాడని అస్సలు ఊహించలేదని భార్య కన్నీటి పర్యంతమవుతోంది.


Also Read:  చంపేసిన చపాతీ.. తింటూ తింటూనే బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే?

మరోవైపు కార్తిక్ ఆత్మహత్య వెనక అప్పులే కారణం అని తెలుస్తోంది. తన ఏడాదిన్నర కూతురు మానసిక స్థితి బాలేకపోవడంతో తరచు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అందుకోసం అప్పులు తేవడం, దానికి వడ్డీలు కట్టడం కార్తిక్‌కు భారంగా మారింది. ఓ వైపు కూతురి ఆరోగ్యం, మరోవైపు పెరిగిన అప్పులతో సతమతమైన కార్తిక్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్తీక్-మానస దంపతులకు మూడు నెలల మరో కూతురు ఉంది. అయితే సూసైడ్ లెటర్‌లో భర్త రాసిన పలు అంశాలు కూడా అనుమానాలకు దారి తీస్తున్నాయి. భార్యను బ్లేమ్ చేయడం తనకు ఇష్టం లేదని.. ఇంకో పెళ్లి చేసుకోవాలని భార్యకు సూచించడంతో లెటర్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో భార్యాభర్తల దాంపత్యంలో ఎదైనా వివాదం నెలకొందా? కార్తీక్‌ తన కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

కార్తిక్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం తల్లిదండ్రులను, భార్య పిల్లలను శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. కాబట్టి.. సమస్య ఏదైనా కావచ్చు.. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు. గట్టిగా నిలబడి సమస్యను ఎదుర్కున్న వాడే నేటి మనిషి.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×