Prohibition of Alcohol: మద్యపానం మహా డేంజర్.. దీని వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలో జరిగే హత్యలు, మానభంగాలకు ఇది కూడా ఒక కారణం. దేశ వ్యాప్తంగా మద్యం బాధితులు కోట్లలో ఉన్నారు. మద్యానికి బానిసై జీవితాలను ఆగం చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. మద్యం వల్ల విడిపోయిన భార్యాభర్తల సంఖ్య అయితే చెప్పనక్కర్లేదు. సమాజంలో జరిగే నేరాలు, దారుణాలకు మద్యం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయినప్పటికీ మద్యపాన నిషేదానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అయితే మద్యపాన నిషేదం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ.. కొన్ని గ్రామాలు దీనిపై స్వయంగా ముందుకు వచ్చి తీసుకునే నిర్ణయాలు చూస్తే.. చాలా ఆదర్శంగా ఉంటుంది. ఇలా ఇప్పటికే తెలంగాణలో కొన్ని గ్రామాలు మద్యపాన నిషేదాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. వరంగల్ జిల్లా గంగదేవిపల్లె గ్రామంలో కొన్నేళ్ల నుంచి అక్కడ ఎవరూ మద్యం ముట్టుకోరు. తాజాగా మద్యపాన నిషేదంపై కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పాలిందే. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామ ప్రజలందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు.
⦿ ఏడు చెప్పు దెబ్బలు.. రూ.లక్ష జరిమానా
తమ గ్రామాల్లో మద్యపాన నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం మద్యం తాగినవారికి ఏడు చెప్పు దెబ్బలతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారని ప్రకటించుకున్నారు. ఈ నిబంధన మద్యం అమ్మిన వారికి కూడా వర్తిస్తోంది. వీరి తీసుకున్న నిర్ణయం చుట్టు పక్కల గ్రామాలు ఆదర్శంగా తీసుకున్నారు. పక్కన ఉన్న కొన్ని గ్రామాలు కూడా తన వీలేజీల్లో మద్యపాన నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఆయా గ్రామ ప్రజలు అందరూ ఓ చోట ఏకమయ్యారు. తమ ఊళ్లల్లో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేదాన్ని అమలు చేయాలని అనుకున్నారు. దీనిలో భాగంగానే ఎవరైనా మద్యం సేవిస్తే ఏడు చెప్ప దెబ్బలు.. అలాగే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ప్రకటించారు.
ALSO READ: HPCL: డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. భారీ వేతనం, దరఖాస్తు ఇంకా 5 రోజులే గడువు
⦿ యువత కోసమే ఈ గొప్ప నిర్ణయం
అలాగే ఎవరైనా మద్యం తాగినట్టు.. గుర్తించి చెపపినా.. మద్యం పట్టించినా రూ.20వేలు బహుమతిగా అందజేస్తామని తీర్మాణానికి వచ్చారు. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఏడు చెప్పు దెబ్బలు ఉంటాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు విలువైన మాటలు మాట్లాడారు. మద్యం సేవించి యువత చెడిపోతున్నారని అన్నారు. భారీగా అప్పులు చేసి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని చెప్పారు. యువత భవిష్యత్తు కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మందు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పెద్ద మనుషులు చెప్పారు. వీటన్నింటిని ఆలోచించే.. గ్రామాల్లో మద్యపాన నిషేధ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిషేదాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఊరుకు ఇద్దరు చొప్పున కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు గ్రామ పెద్దలు చెప్పారు. గ్రామ సరిహద్దుల్లో మద్యం తాగినా శిక్షలు అమలు అవుతాయని క్లారిటీ ఇచ్చారు.
⦿ ఎన్నో గ్రామాలకు ఇది ఆదర్శం
గ్రామస్థులు తీసుకున్ని ఈ నిర్ణయం సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మద్యపానం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పులిస్టాప్ పెడనుందని ఆశిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రంలోని చాలా ఆదర్శంగా నిలవనుంది.