Chiranjeevi Fan: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ఎంతో తాపత్రయపడుతుంటారు. అయితే ఒకప్పుడు హీరో హీరోయిన్లను కలవాలి అంటే ఎలాంటి మార్గాలు ఉండేది కాదు, వాళ్ళు ఏదైనా సినిమా షూటింగ్ పనుల నిమిత్తం సమీప ప్రాంతాలకు వచ్చినప్పుడు లేదా ఏదైనా సినిమా వేడుకలలో పాల్గొన్నప్పుడు వారితో కలిసి ఫోటోలు దిగే అవకాశం ఉండేది కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలతో ఫోటోలు కావాలంటే అభిమానులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ అభిమాన హీరోని కలవడం కోసం ఇటీవల కాలంలో నిరాహార దీక్షలు చేయటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
నిరాహార దీక్ష
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవికి(Chiranjeevi) ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవిని ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తున్నారు.. ఇలాంటి ఒక గొప్ప హీరోతో ఫోటో దిగాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యపడదు. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ నియోజక వర్గం సోమందేపల్లి మండలానికి చెందిన రామకృష్ణ (Rama Krishna)అనే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.
30 సంవత్సరాల కోరిక…
గత 30 సంవత్సరాల నుంచి చిరంజీవితో కలిసి ఒక్క ఫోటో దిగాలని ఈయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా తన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు ఇప్పటివరకు చిరంజీవిని ఒక్కసారి కూడా కలవకపోవడమే కాకుండా తనతో కలిసి ఫోటో దిగే సందర్భం కూడా రాలేదు దీంతో ఆయన ఎలాగైనా చిరంజీవితో ఫోటో దిగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలా గత 30 సంవత్సరాలుగా తన అభిమాన హీరోని కలిసే అవకాశం రాకపోవడంతో ఏకంగా ఈయన నిరాహార దీక్ష చేపట్టారు. చిరంజీవి తనని కలిసే వరకు నిరాహార దీక్ష మానుకోనని తెలియజేశారు.
చిరంజీవితో సినిమా చేయాలి..
ఇలా చిరంజీవిని కలవడమే కాకుండా తనతో సినిమా చేయటం కూడా తన కల అని తెలియజేశారు. కచ్చితంగా చిరంజీవిని కలిసి ఆయన కోసం నేను సిద్ధం చేసుకున్న కథను తనకు వినిపించాలని, చిరంజీవితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనేదే తన లక్ష్యమని తెలిపారు. చిరంజీవి విషయంలో తాను వెనకడుగు వేసే ప్రసక్తేలేదని, చిరంజీవి గారిని కలిసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. ఈ నిరాహార దీక్షలో తాను మరణించిన పరవాలేదు తాను మాత్రం దీక్ష విరమించేది లేదని భీష్ముంచుకుని కూర్చున్నారు. మరి 30 సంవత్సరాల నుంచి తీరని తన కోరికను చిరంజీవి తీరుస్తారా? తనని కలవడానికి అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదే విధంగా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటించిన విశ్వంభర (vishwambhara) సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Sanjeev Movie: ‘సంజీవ్’ పోస్టర్ రిలీజ్.. ఈ మూవీ ప్రత్యేకత ఇదే