BigTV English

Job: బట్టతలని జాబ్ తీసేస్తే.. 70 లక్షలు వసూల్.. చివర్లో ట్విస్ట్..

Job: బట్టతలని జాబ్ తీసేస్తే.. 70 లక్షలు వసూల్.. చివర్లో ట్విస్ట్..

Job: ఈరోజుల్లో బట్టతల కామన్. ఏజ్ తో పనిలేకుండా చిన్న వయసులోనే వచ్చేస్తోంది. చాలామందికి పెళ్లిళ్లు కాకపోవడానికి కూడా ఇదే కారణం అవుతోంది. కొందరు విగ్గులతో కవర్ చేస్తుంటే.. చాలామంది లోలోన నలిగిపోతున్నారు. ఇంత కామన్ అయిన బట్టతలను సాకుగా చూపించి ఉద్యోగం నుంచి తీసేశాడు ఓ బాస్. అట్టెట్టా.. అంటూ ఆ బాధితుడు కోర్టుకు వెళ్లడంతో 70 లక్షలు పరిహారం కట్టాల్సి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


అతని పేరు మార్క్ జోన్స్. వయసు 61 ఏళ్లు. బ్రిటన్ లో ఓ మొబైల్‌ ఫోన్ల సంస్థలో సేల్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వయస్సుకు తగ్గట్టే బట్టతల ఉంది. అయినా, బట్టతలకు అతని ఉద్యోగానికి సంబంధంలేదనుకోండి. కానీ, వాళ్ల బాస్ అలా అనుకోలే. ఈమధ్య కంపెనీ సేల్స్ తగ్గడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. వన్ ఫైన్ మార్నింగ్ అతనికో ఖతర్నాక్ ఐడియా వచ్చింది. ఏజ్ పైబడిన ఉద్యోగులు మార్కెటింగ్ లో రాణించలేకపోతున్నారని గుర్తించాడు. సేల్స్ డిపార్ట్ మెంట్ ను యంగ్ టీమ్ తో నింపేయాలని అనుకున్నాడు. ఇక అంతే. ఆఫీసులో 50 ఏళ్లు దాటి.. బట్టతల ఉన్న ఉద్యోగులందరినీ జాబ్ నుంచి తీసేశాడు. ఆ వేటులో మార్క్ జోన్స్ జాబ్ కూడా పోయింది.

అయితే, ఆయన అందరిలా సైలెంట్ గా ఉండలేదు. తనకు ఇంతే ప్రాప్తి అనుకోలేదు. అలా ఎలా తీసేస్తారు? అంటూ కోర్టుకు వెళ్లాడు. కంపెనీపై కేసు వేశాడు. విచారణ జరిపిన న్యాయస్థానం.. జోన్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎలాంటి కారణం లేకుండా వివక్షపూరితంగా విధుల నుంచి తొలగించారంటూ.. బాధితుడికి 71వేల పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.71లక్షలు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ కంపెనీని ఆదేశించింది.


మనోడు ఆ డబ్బులతో పండుగ చేసుకుంటున్నాడు. బట్టతలేగా అని పీకేస్తే.. భారీ పరిహారమే ఇవ్వాల్సి వచ్చిందంటూ కంపెనీ యాజమాన్యం తలపట్టుకుంటోంది. ఇక్కడో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. మార్క్ జోన్స్ ను ఉద్యోగం నుంచి తీసేసిన అతని బాస్ ఫిలిప్ కు కూడా బట్టతల ఉండటం ఆసక్తికరం.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×