BigTV English

Rajinikanth Remunaration: అదేరా త‌లైవా.. 7 రోజులు.. పాతిక కోట్లు

Rajinikanth Remunaration: అదేరా త‌లైవా.. 7 రోజులు.. పాతిక కోట్లు

Rajinikanth Remunaration:సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ .. ఏడు ప‌దులు వ‌య‌సు దాటినా కూడా క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఇంకా ఆయ‌న కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. నెల్స‌న్ దిలీన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ సినిమా షూటింగ్ పూర్తి కాక మునుపే ర‌జినీకాంత్ మ‌రో రెండు సినిమాలు చేయ‌టానికి రెడీ అయ్యారు. అందులో ఒక‌టి ‘లాల్ స‌లాం’ మూవీ. త‌లైవా కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ దీన్ని నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ ఇందులో మెయిన్ హీరోస్‌. ర‌జినీకాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.


లాల్ స‌లాంలో ర‌జినీ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తార‌నే సంగ‌తి ముందుగానే బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆయ‌న పాత్ర ఎంత సేపు ఉంటుంద‌నే దానిపై క్లారిటీ ఇప్పుడే వ‌చ్చింది. రజినీకాంత్ పాత్ర కోసం మేక‌ర్స్ 7 రోజులు కావాల‌ని అడిగార‌ట‌. అయితే ఆయ‌న అడిగిన రెమ్యున‌రేష‌న్ షాకింగ్‌. ఎంతో తెలుసా! రోజుకు రూ.4 కోట్లు కావాల‌ని ర‌జినీకాంత్ డిమాండ్ చేశారు. అంటే వారం రోజుల‌కు క‌లిపి రూ.28 కోట్లు అవుతాయి. అయితే మేక‌ర్స్ దాన్ని రూ.25 కోట్లుగా నిర్ణ‌యించి ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. అప్పుడు త‌లైవా లాల్ స‌లాం సినిమాకు డేట్స్ కేటాయించారు. వారం రోజుల‌కు ఈ రేంజ్‌లో డ‌బ్బులు డిమాండ్ చేయ‌టం, దానికి మేక‌ర్స్ ఒప్పుకోవ‌టం చూసిన కోలీవుడ్ వ‌ర్గాలు షాక‌వుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ద‌టీజ్ త‌లైవా అని అన్నారు.

ఇది కాకుండా లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో పూర్తి స్థాయి హీరోగా మ‌రో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. జై భీమ్ ద‌ర్శ‌కుడు టి.జి.జ్ఞాన‌వేల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జైల‌ర్ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్‌, టి.జి.జ్ఞాన‌వేల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×