
Flash News : ఈ ఏడాది దీపావళిని 12న జరుపుకోవాలా ? లేదా 13న జరుపుకోవాలా ? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారమే దీపావళిని జరుపుకోవాలని పండితులు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సోమవారం దీపావళి పండుగ సందర్భంగా సెలవు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. 13న వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణ తరగతులు ఉన్నాయని, సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలను సజావుగా నిర్వహించలేమని తెలిపింది.
ఈ కారణంగానే సోమవారం దీపావళి సెలవును నిరాకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి షాక్ తగిలింది. వాస్తవానికి గతేడాది చివర్లో దీపావళి సెలవుదినం నవంబర్ 12నే ఉండగా.. నవంబర్ 13న ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. ఇప్పుడు దీనిని సవరించి 13ని దీపావళి సెలవుదినంగా మార్చారు. అంటే.. నవంబర్ 14న ప్రత్యామ్నాయ సెలవుదినం అమల్లోకి వస్తుంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడురోజులు సెలవులు వచ్చాయి. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారికి మాత్రం ఈ సెలవు వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పొరుగున ఉన్న ఏపీలో కూడా సోమవారమే దీపావళి సెలవును ప్రకటించారు.
Ponnam Prabhakar : రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం ఓ కల : పొన్నం ప్రభాకర్