BigTV English

Diwali-Leicester : లెస్టర్‌లో దీపావళి ఎంతో ఘనం

Diwali-Leicester : లెస్టర్‌లో దీపావళి ఎంతో ఘనం

Diwali-Leicester : దేశవిదేశాల్లో జరుపుకునే పండుగ దీపావళి. ప్రధానంగా దేశం వెలుపల ఈ ఫెస్టివల్‌ లెస్టర్(Leicester)లో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. బ్రిటన్‌లోని ఈ నగరంలో ఏటా దివ్వెల పండుగ సందర్భంగా వేలాది సంఖ్యలో హిందువుల నృత్యాలు, కేరింతలతో వీధులన్నీ సందడిగా మారిపోతాయి. లండన్ వెలుపల భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్న రెండో నగరం ఇదే. లెస్టర్‌లో 6.6% మంది ఇండియన్లు నివసిస్తున్నారు.


వాణిజ్య కూడలి గోల్డెన్ మైల్ వద్ద 40 ఏళ్లుగా దివ్వెల పండుగను నిర్వహిస్తుండటం విశేషం. ఈ సారి కూడా దీపావళికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరిగే వేడుకల్లో పరేడ్, డ్యాన్స్‌లు, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలతో బెల్‌గ్రేవ్ రోడ్ ఏరియా హోరెత్తనుంది. మెర్క్యురీ ప్రైజ్ విన్నర్ తల్వీన్ సింగ్ ఈ సారి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

దాదాపు 40 వేల మంది హాజరవుతారని అంచనా. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పండుగ సంరంభం ఆరంభమవుతుంది. వంద విల్లో లాంతర్లతో ఈ పెరేడ్ జరుగుతుంది. పాలీవినైల్ ఎసిటేట్(పీవీఏ) గ్లూతో పల్చటి పొరతో పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ లాంతర్లను స్థానిక విద్యార్థులు, కుటుంబాలు స్వయంగా తయారు చేస్తారు.


లెస్టర్ సిటీ కౌన్సిల్, స్థానికంగా ఉండే సాంస్కృతిక సంస్థలు ఈ వేడుకలను సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఆర్ట్స్ కౌన్సిల్ ఇంగ్లండ్ నిధులు సమకూరుస్తుంది. డీజే హోరుతో పాటు తోలుబొమ్మలాటలు ఈ సారి అదనపు ఆకర్షణలు కానున్నాయి. నియాన్ వాటర్ ఫాల్ లైట్ షో, లేసర్ లైట్ షో కూడా కనువిందు చేయనున్నాయి.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×