BigTV English

Moranchapalli news: పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి ప్రజలు.. మోరంచపల్లిలో దయనీయ పరిస్థితులు..

Moranchapalli news: పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి ప్రజలు.. మోరంచపల్లిలో దయనీయ పరిస్థితులు..
Moranchapalli village flood news

Moranchapalli village flood news(Telangana news live) :

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరుణుడి సృష్టించిన బీభత్సాన్ని యావత్ ప్రపంచం చూసింది. వరద ఉద్ధృతికి ఒక్కసారిగా ఊరి ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగులు, చెట్లపైకి ప్రజలు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గ్రామంలో వర్షం తగ్గినా అక్కడి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడంలేదు. వరద కూడా తగ్గుముఖం పట్టినా.. గ్రామంలో దయనీయపరిస్థితులున్నాయి.


గురువారం పునరావాస కేంద్రాలకు వెళ్లిన గ్రామస్థులు.. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్తున్నారు. అక్కడ పరిస్థితి చూసి బోరున విలపిస్తున్నారు. చనిపోయిన, వరదకు కొట్టుకుపోయిన మూగ జీవాలను తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. తమ గ్రామానికి ముంపు ప్రమాదం ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. మోరంచపల్లి ప్రస్తుతం స్మశానాన్ని తలపిస్తుంది. కొట్టుకుపోయిన వస్తువులు, ఎక్కడికక్కడ చనిపోయిన మూగ జీవాలతో స్మశానాన్ని గుర్తు చేస్తోంది. ఇక గ్రామంలో చాలా మందికి కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగలలేదు. ఇంట్లో సామాన్లు కూడా వరదకు కొట్టుకుపోయాయి. పేరుకే ఊరు మిగిలింది కానీ.. ఊరులో ఏం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×