BigTV English

Rahul Gandhi :వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందని.. ఏపీ, తెలంగాణ నేతలకు రాహుల్ దిశానిర్దేశం..

Rahul Gandhi :వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందని.. ఏపీ, తెలంగాణ నేతలకు రాహుల్ దిశానిర్దేశం..

Floods in Andhra Pradesh Telangana:Rahul Gandhi asks Congress workers to mobilize aid for relief rescue efforts: ఇటీవల కాలంలో రాహుల్ గాంధీలో రాజకీయ పరిణితి బాగా పెరిగింది. ముఖ్యంగా అధికార పక్షంపై ఆయన మాట్లాడే ప్రతి మాట సూటిగా బాణంలా దిగుతోంది. మోదీ అంతటి రాజకీయ అనుభవ శాలి సైతం రాహుల్ లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా రాహుల్ యాక్టివ్ అయ్యాక ఇండియా కూటమి సైతం అనూహ్య విజయాలు సాధిస్తోంది. యూపీ, కేరళ రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్ కు జోడో యాత్ర బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ప్రతిపక్ష నేతగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలతో రాహుల్ గాంధీ రాజకీయాలలో ఆరితేరారు. గతంలో ఆయనను పట్టుకుని పప్పు అన్న బీజేపీ నేతలు ఇప్పుడు నిప్పు అంటున్నారు. రాహుల్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ప్రభావంతో సామాన్యులకు చేరువయ్యారు రాహుల్ గాంధీ.


సానుకూల వైఖరి

ప్రజా సమస్యల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు రాహుల్. మణిపూర్ అల్లర్లు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇటీవల మణిపూర్ కూడా పర్యటించారు రాహుల్ గాంధీ. జరిగిన వయనాడ్ ప్రకృతి భీభత్సానికిక తల్లడిల్లిపోయిన విషయం తెలిసిందే. అయితే కేరళలోనూ తన కార్యకర్తలను ప్రోత్సహించి సహాయక చర్యలలో ముమ్మరంగా పాల్గొనవలసిందిగా కోరారు. పర్యాటకంగా ఎంతో శోభనిచ్చే వయనాడ్ ను కేంద్రం పునరుద్ధరించాలని లేఖ కూడా రాశారు. ప్రపంచం నలుమూలలనుంచి వయనాడ్ కు సందర్శకులు వస్తుంటారని..వయనాడ్ లో కేంద్రం చేసిన అంతంత మాత్రం సాయంతో ఇంకా అక్కడి పరిస్థితి కుదుట పడలేదని అన్నారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 400 మందికి పైగా అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు కూడా తెలుసుకుంటున్నారు.


సహాయక చర్యలలో పాల్గొనండి

గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, వరదలు విరుచుకుపడుతున్నాయి. విజయవాడలో బుడమేరు పొంగి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోనూ అనేక వాగులు, వంకలు తెగిపోయాయి. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వరద సహాయక చర్యలలో ముమ్మరంగా పాల్గొనాల్సిందిగా కోరారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు చేసే సాయమే గుర్తుంచుకుంటారని..కష్టపడి పనిచేసిన నేతను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని..ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు యాక్టివ్ గా ఉండాల్సిస సమయం ఆసన్నమయిందని అన్నారు.

కేంద్రంపై ఒత్తిడి చేయండి

అవసరమైతే కేంద్రం అందించే సాయంపై ఒత్తిడి చేయాల్సిందిగా కార్యకర్తలను కోరారు. తెలంగాణలో ఉన్నది ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాగా ఆంధ్రాలో మాత్రం కూటమి అధికారంలో ఉంది. కూటమిలో మోదీ సర్కార్ కూడా ఓ భాగమే. అందుకే ఆంధ్రాలలోనూ కాంగ్రెస్ కు గుర్తింపు రావాలంటే ప్రస్తుతం వరద సహాయక చర్యలలో పాల్గొనాల్సిందే అని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అధినేతలకు, కార్యకర్తలకు సూచించారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×