BigTV English

Chiranjeevi Demands: బ్రేకింగ్.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. చిరు పోస్ట్ వైరల్

Chiranjeevi Demands: బ్రేకింగ్.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. చిరు పోస్ట్ వైరల్

Chiranjeevi Demands Bharat Ratna to Sr NTR: తెలుగు సినిమా.. ఈ మాట వినపడగానే అందరికి గుర్తొచ్చే మొట్టమొదటి నటుడు నందమూరి తారక రామారావు. నటన అంటే ఆయన .. ఆయన అంటే నటన. తెలుగువారికీర్తి కోసం పాటుబడినవారిలో ఎన్టీఆర్ ముందు ఉంటారు. నేడు ఆయన 101 వ జయంతి. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే ఎన్టీఆర్ కుటుంబం ఆయన సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.


తెలుగువాడు అని చెప్పుకొనే ప్రతి ఒక్కరు నేడు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆయన చేసిన పాత్రలు లెక్కలేనన్ని.. అలాంటి నటుడు మళ్లీ పుట్టడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అభిమానులే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నేడు ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఇక ఆ పోస్ట్ లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

“కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Also Read: Bengaluru Police Notice Again Hema: హేమాకు మరోసారి, జూన్ ఫస్ట్ రావాలంటూ..

చిరు- ఎన్టీఆర్ ల మధ్య ఉన్న అనుబంధం చాలా స్పెషల్. వారిద్దరి అనుబంధం మరువలేనిది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏకైక సినిమా తిరుగులేని మనిషి. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి వీరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్ లో స్టార్లుగా ఉన్నా కూడా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకొనేవారట. ఇక ఆ స్నేహాన్ని బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్నాడు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×