Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేటీఆర్ అరెస్టుపై హైకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కాకపోతే ఈ కేసులో సెక్షన్ 405, 409 గురించే వాదనలు, గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ప్రస్తావించారు. దర్యాప్తు ప్రారంభంలో ఈ విధంగా చేయడం కరెక్టు కాదన్నది ఏసీబీ వైపు మాట.
ఫార్ములా కేసు వాదించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తరపున ఢిల్లీ నుంచి న్యాయ వాదులు వచ్చారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే. ఒక్క రోజుకు ఆయన నాలుగు కోట్ల రూపాయలు ఫీజు ఛార్జ్ చేస్తారంటూ ఢిల్లీలో చర్చించుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కేటీఆర్ తన లాయర్‌గా పెట్టుకుంటున్నారని అంటున్నారు. తప్పు చేయనప్పుడు ఇంత ‘రిచ్’గా భయపడడం ఎందుకంటూ సోషల్ మీడియాలో సైటెర్లు పడిపోతున్నాయి.
నార్మల్‌గా అయితే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించే కేసులకు ఫీజు భారీ మొత్తంలో ఉంటాయి. కానీ ఎంత అనేది మాత్రం బయటపడదు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేసుపై చాలామంది పోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఫార్ములా రేసును భారీ ఖర్చుగా చాలా దేశాలు భావిస్తున్నాయి. కెనడా, సౌతాఫ్రికా, ఇటలీ, ఇండోనేషియా లాంటి దేశాలు దీన్ని రద్దు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. 2017 లో కెనడా ఆ తరహా రేసును రద్దు చేసింది. ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక భారమని భావించి రద్దు చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్‌రెడ్డి
2023లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ రేసు చేసుకున్నట్లు చెబుతున్నారు. భారత కరెన్సీలో దాదాపు రూ.137 కోట్లు ఖర్చు అనవసరమని దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటలీ కూడా పైకి భద్రతా కారణాలు ప్రచారం చేసినా, అసలు కారణం ఆర్థిక భారమేనని భావించి తప్పుకుందని తెలుస్తోంది. ఇండోనేషియాలో అయితే ప్రతిపక్షాల నిరసనలతో 2020-24 రేసులు రద్దు అయ్యాయి. లేకుంటే ప్రభుత్వానికి 688 కోట్ల నష్టం వచ్చేదని భావిస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్గాతీయ పత్రికలు సైతం పేర్కొన్నాయి.