Bhairavam First Song: కోలీవుడ్ కమెడియన్ సూరి హీరోగా నటించిన చిత్రాల్లో గరుడన్ ఒకటి. గత ఏడాది మే లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ మరో ఇద్దరు హీరోలుగా నటించారు. ముగ్గురు స్నేహితులుగా కథగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శల ప్రశంసలను అందుకుంది. ఇక ఇప్పుడు గరుడన్ తెలుగులో భైరవం అనే పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అందాల తారలు ఆనంది, అదితి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
Juhi Chawla: అమ్మ బాబోయ్ రూ.4600 కోట్ల ఆస్తులే.. అమితాబ్ బచ్చన్ కు కూడా లేవు కదరా
సాయి శ్రీనివాస్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వెన్నెల అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” గుండెలోన చప్పుడే లవ్వు డప్పు కొట్టేరో.. నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసేరో.. అంటూ సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. తిరుపతి జావాల లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల తమ వాయిస్ తో సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.
ఇక గ్రామీణ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ సాంగ్ లో కూడా ఆ విలేజ్ వాతావరణం మొత్తం కనిపిస్తుంది. అదిరి శంకర్ ప్రేమలో పడ్డ శ్రీనివాస్ .. తన ప్రేమికురాలి అందాన్ని వర్ణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే.. అదితి అందం మరో ఎత్తు. స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా అదితి ఎంట్రీ ఇచ్చింది. విరుమన్, మహావీర్ లాంటి సినిమాల్లో నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
Rajamouli: రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్.. శంకర్ ఫీలవుతారేమో జక్కన్న..?
ఇక మొదటిసారి ఈ చిన్నది భైరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది . ఈ సాంగ్ లో లంగా వోణి కట్టుకొని కర్లీ హెయిర్ తో మరింత అందంగా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అమ్మడు ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అదితి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.