Formula E Race scandal: ఫార్ములా ఈ రేసు కేసు ఎంత వరకు వచ్చింది? ఇక కదలిక లేనట్టేనా? ఈ కేసు పనైపోయిందని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుందా? ఎఫ్ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు ఇచ్చిందా? రేపో మాపో మరోసారి ఏ-1, ఏ-2ను విచారించాలని ఆలోచన చేస్తుందా? అవుతునే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏక్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇవ్వడం, దాదాపు మూడు గంటలపాటు విచారణ చేపట్టింది.
తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఈ కేసు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. అయితే తమకు నాలుగు వారాలు గడువు కావాలని ఏసీబీకి లేఖ పంపినట్టు సమాచారం. వారిని విచారించిన తర్వాత మరోసారి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. సేకరించిన వివరాలు దగ్గరపెట్టి వీరిని విచారించనుంది. దీంతో ఏసీబీ పని పూర్తి కానుంది.
ముఖ్యంగా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు బదిలీపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఏస్ నెక్ట్స్ జెన్ నుంచి కావాల్సిన సమాచారం అందుకుంది. ఇక ఎఫ్ఈవో కంపెనీ వంతైంది. డబ్బులు లావాదేవీలు, కంపెనీ మధ్య జరిగిన ఒప్పందాలపై ఫోకస్ చేసింది. అలాగే ఏస్ నెక్ట్స్ జెన్-ఎఫ్ఈవో-గ్రీన్ కంపెనీ మధ్య ఏం జరిగిందనే దానిపై విచారణ చేపట్టనుంది. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులను విచారిస్తే లోగుట్టు బయటపడు తుందన్నది ఏసీబీ ఆలోచన.
ALSO READ: పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! కాంగ్రెస్ లీడర్లు వినూత్న ప్రచారం
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం
FEO కంపెనీకి నోటీసులు ఇచ్చిన ఏసీబీ
గత ప్రభుత్వ హయాంలో రూ.55 కోట్లు FEO కు బదిలీ చేసిన HMDA
FEO ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న ఏసీబీ
ఏసీబీని 4 వారాల పాటు గడువు కోరిన FEO pic.twitter.com/H2nb2PMpm2
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025