BigTV English

Tollywood: సమ్మర్ సీజన్ ను గాలికొదిలేస్తున్న స్టార్స్… ఆ ముగ్గురు బడా హీరోల ఫ్యాన్స్ కు నిరాశేనా ?

Tollywood: సమ్మర్ సీజన్ ను గాలికొదిలేస్తున్న స్టార్స్… ఆ ముగ్గురు బడా హీరోల ఫ్యాన్స్ కు నిరాశేనా ?

Tollywood : టాలీవుడ్ ఎంతగానో ఎదురుచూసిన సంక్రాంతి సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అయితే ఫలితాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కాగా, అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnaam) మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక బాలయ్య హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును కూడా దాటలేకపోయింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెరపైకి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చివరికి డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ బిగ్ సీజన్ సమ్మర్ పై పడింది ప్రేక్షకుల దృష్టి. కానీ ఎప్పటిలా ఈసారి సమ్మర్ కి పెద్ద సినిమాలేవి రిలీజ్ కావట్లేదు. పలువురు బడా హీరోలు ఈ సమ్మర్ ను గాలికి వదిలేస్తున్నారు.


ఆ ముగ్గురు హీరోల సినిమాలూ కష్టమే

సమ్మర్లో రిలీజ్ అవుతుందని ఈగర్ గా వెయిట్ చేసిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. అలాగే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ఇంకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు.


ఆ తర్వాత సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్న మరో బడా మూవీ ‘విశ్వంభర’ (vishwambhara). మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్ పనుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీ రిలీజ్ డేట్ ఓటీటీ డీల్ పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

ఈ రెండు సినిమా తర్వాత సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన మరో మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఇంకా బయ్యర్లు దొరకలేదని, కాబట్టి ఈ మూవీ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మరో మూవీ ‘ఓజీ’తో పోలిస్తే ఈ మూవీకి బజ్ కూడా చాలా తక్కువగా ఉంది. మొత్తానికి ఈ మూడు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఇంకా కన్ఫామ్ కాకపోవడంతో ఈసారి సమ్మర్ కి తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.

సమ్మర్ కి చిన్న సినిమాల సందడి

ఈ ఏడాది వేసవి రేసులో మీడియం బడ్జెట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, కళ్యాణ్‌రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ వంటి యంగ్ హీరోలు తమ చిత్రాలతో సమ్మర్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సన్నీ డియోల్, ధనుష్, సూర్య వంటి ఇతర భాషల స్టార్స్ వేసవిలో తమ సినిమాలను రిలీజ్ చేస్తారు. ఆ సినిమాలు తెలుగులో కూడా తెరపైకి వస్తాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×