E-Paper
Advertisement

Maoists Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. మరో నలుగురు లొంగుబాటు

Maoists Surrender: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. మరో నలుగురు లొంగుబాటు
Advertisement

Maoists Surrender: మరో నలుగురు మావోయిస్టులు తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతే వాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని పోలీసులు వెల్లడించారు. భద్రత బలగాలపై అనేక ఎన్కౌంటర్లు, ఆకస్మిక దాడులు, ఆయుధాల పేలుడు పదార్థాల సరఫరా, నెట్వర్క్ విస్తరణ, గ్రామస్తులను బెదిరించి నేర కార్యకలాపాలకు పాల్పడే వారిని చెప్పారు. ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం) స్థాయిలో ఉన్నారన్నారు. పోలీసుల నిరంతర ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్లు, భద్రత బలగాల పట్టు పెరగడం, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పించే పునరావాస పథకాలకు ఆకర్షితులై లొంగిపోయినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు.

ప్రశాంత వాతావరణం

లొంగిపోయిన నలుగురిపై చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయని వాటన్నింటినీ తొలగించి పునరావాసం తో పాటు జీవనోపాధి కోసం అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంకా అడవుల్లో మిగిలిపోయిన మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పునరావాస, జీవనోపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసా మార్గాన్ని వీడి, కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని విజ్ఞప్తి చేశారు. చతిస్గడ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రత ఏర్పాట్లు వంటి చర్యలతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు క్షీణించిపోతున్నాయని వెల్లడించారు.

Advertisement

Also Read: Facepack: కేవలం యాభై రూపాయలతో ముఖాన్ని ఇలా మెరిపించేయండి, ఇదొక్కటి చాలు

మెల్ల మెల్లగా అంతం చేసేలా..

మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కార్యకలాపాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. కేంద్ర, చత్తీస్గడ్ సంయుక్త బలగాల సమన్వయంతో బీజాపూర్, సుక్మా, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలతోపాటు మావోయిస్టులకు స్వర్గ ధామంగా ఉన్న అబూజ్ మాడ్ సైతం ప్రస్తుతం నక్సల్స్ రహిత ప్రాంతాలుగా వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో గిరిజనులు అభివృద్ధిని కోరుకుంటున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా బలగాలు చత్తీస్గడ్ రాష్ట్రంలోని మావోయిస్టుల కు నిలయమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎదురు కాల్పులు జరిపిన వారిని మట్టు పెడుతూ, జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారిని సరెండర్ చేయిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను పూర్తిగా అంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సైతం రచించుకొని భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతకంటే ముందే మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు పకడ్బందీ చర్యలను చేపడుతోంది.

Advertisement

Also Read: Couples Fights: దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలా? బెడ్‌రూమ్‌లో ఇలాంటి ఫోటోలు ఉంచి చూడండి!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×