BigTV English

G Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్

G Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్

Union Minister G Kishan Reddy news(TS today news): హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పరీక్ష అవకతవకలపై యువజన విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.


నీట్ పరీక్ష విధానంలో జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు. అయితే అనుమతి ఇవ్వకపోవడంతో యువజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బర్కత్ పురలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేపడుతున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు.


వెంటనే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్‌తోపాటు ఎన్ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్‌తో పాటు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.

Also Read: బొగ్గు రాజకీయం.. కేటీఆర్ చెప్పినదానిలో నిజమెంత ?

కాగా, నీట్ రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నీట్‌లో జరిగిన అవకతవకలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్..నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ పాలన పేపర్ లీకుల సర్కార్‌గా మారిందని విమర్శలు చేశారు.

Tags

Related News

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..

Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

Big Stories

×