Big Stories

Investments in Telangana : తెలంగాణలో పెట్టుబడులు తగ్గాయంటున్న బీఆర్ఎస్.. ఇదిగో దిమ్మతిరిగే సమాధానం..

Investments in Telangana : తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది ? పెట్టుబడులు తగ్గిపోయాయి.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అప్పట్లో ఎలా ఉండేది తెలంగాణ.. ఇప్పుడేలా ఉంది? ఇలా బీఆర్‌ఎస్‌ నేతలు తెగ చెబుతున్నారు కదా. ఇలా వాదించేవారందరికీ దిమ్మతిరిగే సమాధానం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం.

- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు ఏ మాత్రం తగ్గలేదు సరికదా భారీగా పెరిగాయి. అది కూడా అలా ఇలా కాదు. ఈ పెట్టుబడులు ఏకంగా 132.5 శాతంగా ఉంది. అంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్‌ కంటే.. 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏకంగా డబుల్ అయ్యాయి తెలంగాణలో పెట్టుబడులు. 2023 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2024 ఫైనాన్షియల్‌కు వచ్చేసరికి అది 3 బిలియన్‌ డాలర్లకు చేరింది. డబ్బులు రూపంలో చూసుకుంటే దేశంలో ఐదో ప్లేస్‌లో ఉండగా.. గ్రోత్‌ రేట్‌లో చూసుకుంటే 132 శాతంతో మన దరిదాపులో కూడా ఎవ్వరూ లేరు.

- Advertisement -

మీరు అనొచ్చు.. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యింది కదా. ఈ క్రెడిట్ మొత్తాన్ని కాంగ్రెస్‌ గవర్నమెంట్‌కు ఎలా ఇస్తారని? కానీ దానికి కూడా రీజన్ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే దావోస్‌లో పర్యటించారు. ఈ పర్యటన ఎంతగా సక్సెస్ అంటే.. అంతకుముందు ఏడాది తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల కంటే రెండింతల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి. ఏకంగా 40 వేల 232 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అదానీ గ్రూప్‌ నుంచి మొదలు పెడితే.. అనేక మల్లీ నేషనల్ కంపెనీలు తెలంగాణతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఫార్మా, అగ్రో, ఐటీ, ట్రాన్స్‌పోర్ట్, మెడికల్ టూరిజం.. ఇలా అనేక రంగాలకు చెందిన కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు ఫిక్స్ చేసుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చేందుకు మరింత కృషి చేశారు.
ఫలితం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ గణనీయంగా పెరిగాయి.

అంటే తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రాలేదా? అంటే వచ్చాయనే చెప్పాలి. FDI సాధించిన రాష్ట్రాల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది గుజరాత్. 2023లో 4.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2024 వచ్చే సరికి అది 7.3 బిలియన్ డాలర్లకు చేరింది. కానీ గ్రోత్‌ రేట్‌ చూసుకుంటే మాత్రం కేవలం 54.9 శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర, తమిళనాడులో కూడా పెరిగాయి. మహారాష్ట్రలో 0.3 బిలియన్ డాలర్లు.. తమిళనాడులో 0.2 బిలియన్‌ డాలర్లు మాత్రమే పెరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం రెండింతలు పెరిగాయి పెట్టుబడులు.. ఇక మన పక్క రాష్ట్రమైన కర్ణాటక పరిస్థితి అయితే దారుణంగా ఉంది. 2023లో 10.4 బిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులు. 2024కు వచ్చే సరికి 6.6 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంటే కర్ణాటకలో 37 శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి. ఢిల్లీలో కూడా అంతే.. రాజధాని ప్రాంతలో 13.4 శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి. వెస్ట్‌ బెంగాల్‌లో కూడా 15.2 శాతం తగ్గిపోయాయి. ఇలా తగ్గిపోయిన పెట్టుబడులన్ని తెలంగాణకు తరలివచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాదు మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లాల్సిన అనేక పెట్టుబడులు కూడా తెలంగాణకు డైవర్ట్ అయినట్టు కనిపిస్తుంది.

Also Read : బొగ్గు రాజకీయం.. కేటీఆర్ చెప్పినదానిలో నిజమెంత ?

మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఊరికే అయితే జరగదు కదా. తెలంగాణను పెట్టుబడిదారులు ఎందుకు స్వర్గధామంగా భావిస్తున్నారు? ఎందుకు తరలివస్తున్నారు? ఎందుకు ఇలా బిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్నారు? వీటికి ఆన్సర్.. వారికి ఇక్కడ అన్ని ఫెసిలిటిస్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా.. రెడ్ కార్పెట్ పరిచే ప్రభుత్వం ఉంది కాబట్టి. ఎక్కడైతే ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు.. గవర్నమెంట్‌ సపోర్ట్ ఉంటుందో.. అక్కడే తమ కంపెనీలను, పెట్టుబడులను పెట్టాలని చూస్తారు ఇన్వెస్టర్స్. అందుకే హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.

రాష్ట్రాల వారీగా చూస్తే కొన్నింటికి గుడ్ న్యూస్.. కొన్ని రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్. ఇక నేషన్‌ వైడ్‌గా చూస్తే మాత్రం ఇండియా పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. 2022లో ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్న ఇండియా.. 2023 వచ్చే సరికి 15వ స్థానానికి పడిపోయింది. ఒక్క ఏడాదిలో ఏకంగా 43 శాతం FDIలు తగ్గిపోయాయి. 2022లో ఇండియాకు 49.38 బిలియన్‌ డాలర్ల FDIలు రాగా.. 2023లో అది 28.16 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2047 వరకు అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోడీ కలలు తీరుతాయా? అనే డౌట్‌ను రేకెత్తించేలా ఉన్నాయి ఈ లెక్కలు. అయితే కాస్త సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. గ్రీన్‌ఫిల్డ్ ప్రాజెక్ట్స్‌, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఫైనాన్స్‌ డీల్స్‌లో మాత్రం టాప్‌ ఫైవ్‌లో ఉంది ఇండియా.

అయితే ఇండియాలో మాత్రమే తగ్గాయా FDIలు ? విషయాన్ని సగం మాత్రమే చెప్పుకుంటే మన దేశాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. ఓసారి అన్ని దేశాల రికార్డ్‌లను పరిశీలిస్తే.. ఫ్రాన్స్‌లో అత్యంత దారుణంగా తగ్గాయి. ఆ తర్వాత లిస్ట్‌లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, ఇండియా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో తప్పిస్తే.. అన్ని దేశాల్లో FDIలు తగ్గాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణ గ్రోత్‌ రేట్‌ను సాధించడం మాత్రం ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా గుడ్‌ న్యూసే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News