E-Paper
Advertisement

నా తండ్రి గుర్తింపు కోసం.. డీఎన్‌ఏ టెస్టు చేయించాలని యువకుడు ధర్నా!

నా తండ్రి గుర్తింపు కోసం.. డీఎన్‌ఏ టెస్టు చేయించాలని యువకుడు ధర్నా!
Advertisement

Gadwal Priest: స్వేచ్చ బ్యూరో: తనకు తండ్రిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో యేళ్లుగా తమ జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ కుమారుడు తన తల్లితో కలిసి శుక్రవారం గద్వాల పట్టణంలోని ఒక ప్రధాన అర్చకుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

బాధితురాలి కథనం ప్రకారం..

గద్వాల పట్టణం బీసీ కాలనికి చెందిన ఒక మహిళ‌ సుమారు 24 క్రితం ప్రధాన అర్చకుడి ఇంటిలో పని చేసేది. ఈ క్రమంలో‌ తాను చిన్నతనంలో ఉన్నప్పుడు సదరు ప్రధాన అర్చకుడు తనపై అకృత్యానికి పాల్పడి మోసం చేశాడని, ఆ క్రమంలో తాను గర్భవతిని కాగా బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. సమాజానికి, ప్రాణభయానికి వెనకాడి ఇన్నాళ్లూ దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి తన కుమారుడిని డిగ్రీ వరకు చదివించినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Also read: భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు

పెద్దమనుషుల సమక్షంలో..

ఈ సందర్భంగా బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ “స్థానికంగా జరిగిన ఒక వివాదంలో తండ్రి పేరు విషయంలో ఎదురైన మాటల వల్ల నాకు నిజం తెలిసింది. నా తండ్రిని న్యాయం చేయమని అడిగితే చంపుతానని, చేతబడి చేయిస్తానని బెదిరించారు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో నన్ను కొడుకుగా ఒప్పుకుని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పిన అర్చకుడు గత 25-30 రోజులుగా ఫోన్ కాల్స్ ఎత్తకుండా, నంబర్లు బ్లాక్ చేస్తూ తప్పించు తిరుగుతున్నారు.

న్యాయపోరాటం..

Advertisement

ఇన్నాళ్లు కష్టపడి పెంచిన నా తల్లికి, నాకు చట్టబద్ధమైన గుర్తింపు దక్కే వరకు న్యాయపోరాటం ఆపేది లేదు” అని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు అక్కడకి చేరుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు‌. తమ ఇంటి‌‌ ముందు న్యూసెన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకుడి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇది ఇలా‌ ఉండగా నేను ఏ తప్పు‌ చేయలేదు. డీఎన్ ఏ టెస్టుకైన సిద్దంగా ఉన్నాని ప్రధాన అర్చకుడు ప్రకటించారు.

Also read: భారతీయులంటే లోకువ.. విదేశాల కంటే తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు విక్రయిస్తున్న బడా కంపెనీలు

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×