E-Paper
Advertisement

నా లాంటి 40 ఏళ్ల ప్లేయ‌ర్ల‌కు PSL బెట‌ర్‌..అందుకే ఐపీఎల్ వ‌దిలేసా

నా లాంటి 40 ఏళ్ల ప్లేయ‌ర్ల‌కు PSL బెట‌ర్‌..అందుకే ఐపీఎల్ వ‌దిలేసా
Advertisement

Moeen Ali on choosing PSL over IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament) వర్సెస్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League) మధ్య చాలా తేడా ఉంటుందని సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఆడితే ఒక్క రోజులో కోటీశ్వరుడు కావడం గ్యారెంటీ. అదే పాకిస్తాన్ సూపర్ లీడ్ లో అలాంటి అవకాశం ఉండదు. దాదాపు 19 సంవత్సరాలుగా ఐపిఎల్ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కొనసాగుతూనే వచ్చింది. కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొంది. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్.. మొన్నటి చమురు కొర‌తను కూడా తట్టుకోలేక ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాల్సి వచ్చింది.

నా లాంటి 40 ఏళ్ల ప్లేయ‌ర్ల‌కు PSL బెట‌ర్‌..అందుకే ఐపీఎల్ వ‌దిలేసా

పాకిస్తాన్ సూపర్ లీగ్, ఐపీఎల్ మధ్య ఉన్న తేడాను తాజాగా మొయిన్ అలీ ( Moeen Ali ) వివరించారు. తన దృష్టిలో ఐపీఎల్ కంటే పాకిస్తాన్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. తన లాంటి ఏజ్ బార్, 40 ఏళ్లు దాటిన క్రికెటర్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League) బాగా పనికి వస్తుంది అన్నారు. ఈ టోర్నమెంట్ లో ఆడినా, పెద్దగా రాణించ‌క‌ పోయినా పట్టించుకునే వాడే ఉన్నాబోడని పరువు తీశారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నెల‌లోపే ముగుస్తుందని వ్యాఖ్యానించారు. దాని వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఇలాంటి సౌకర్యాలు ఉండవు అని బాంబు పేల్చాడు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఐపీఎల్ లో కోట్ల‌ట్లో డ‌బ్బులు

ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోయినా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోడింగ్ చేస్తారని గుర్తు చేశారు. ఒక సీజన్ లో స‌రిగ్గా ప్రదర్శన చేయకపోతే మరో సీజన్ లో వేలంలోకి వదిలివేయడం గ్యారెంటీ అన్నారు మొయిన్ అలీ ( Moeen Ali ). లేదా రిజర్వు బెంచ్ కు పరిమితం కావాల్సిందేనని వ్యాఖ్యానించారు. తన ఏజ్ బార్ అయిందని కేకేఆర్ జట్టు పెద్దగా తనకు అవకాశం ఇవ్వలేదని.. 2025 ఐపీఎల్ సందర్భంగా ఈ అవమానాన్ని ఎదుర్కొన్నానని గుర్తు చేశారు.

Advertisement

ఆ సీజన్ లో తనకు ఆరు మ్యాచ్ ల‌లో అవకాశం మాత్రమే వచ్చిందని… ఇందులో రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశానని ఎమోషనల్ అయ్యారు మొయిన్ అలీ ( Moeen Ali ). అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే… ఐపీఎల్ లో బాగా రాణిస్తే డబ్బులు ఎక్కువ‌గా వస్తాయని తెలిపారు. యంగ్ స్టార్లకు ఐపీఎల్ సరైన వేదిక అని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా.. గతంలో ఇదే మొయిన్ అలీ… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేకేఆర్ జట్టులోకి వచ్చాడు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

ఆ వెధ‌వ‌ల వ‌ల్ల‌..టీమిండియా, పాక్ మ్యాచ్ చ‌ప్ప‌గా సాగుతున్నాయి

న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

పసికూన శ్రీలంక‌పై కాదు..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల‌ను ఓడించి చూపించు

శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ చూశారా ? 18 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డ్

శ్రీలంక బెల్ట్ ట్రీట్ మెంట్…వాచిపోయిన టీమిండియా ప్లేయ‌ర్ల వీపులు

జైలులో ఉన్నా పాకిస్తాన్ ను వ‌ణికిస్తోన్న ఇమ్రాన్ ఖాన్…న‌ఖ్వీకి ముచ్చెమ‌టలు ప‌ట్టించాడుగా !

కీప‌ర్ గా రిజ్వాన్ ప‌నికిరాడు..క్యాచ్ ప‌ట్టుకోకుండా ఓవ‌రాక్ష‌న్ మాత్ర‌మే చేస్తాడు

Big Stories

Advertisement
×