BigTV English

KCR : కేసీఆర్‌పై తిరుగుబాటు.. గజ్వేల్‌లో రచ్చ.. హైటెన్షన్

KCR : కేసీఆర్‌పై తిరుగుబాటు.. గజ్వేల్‌లో రచ్చ.. హైటెన్షన్

KCR : ఎమ్మెల్యేగా గెలిచా. లక్షల్లో జీతం తీసుకుంటా. ప్రతిపక్ష నేతగా ఉంటా. ఫాంహౌజ్‌లోనే పడుకుంటా. అసెంబ్లీకి రాను. ప్రజల్లోకి రాను. గజ్వేల్ సమస్యలు పట్టించుకోను. అంతా నా ఇష్టం. నన్ను ఎవర్రా అడిగేది. ఇలా దొరతనంతో విర్రవీగే రోజులు పోయాయి. ప్రజలు తిరగబడే గడియలు వచ్చాయి. కేసీఆర్ అయితే ఏంది? గులాబీ దళపతి అయితే మాకేంది? మా ఎమ్మెల్యే.. మమ్మల్ని పట్టించుకోడా? అంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తిరగబడుతున్నారు గజ్వేల్ ప్రజలు.


అవును, ప్రజలకు విసుగొచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఏడాది దాటేసింది. గడిచిన ఏడాదిలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఫాంహౌజ్ గడీ దాటి బయటకు వచ్చింది లేదు. స్థానిక ప్రజలను కలిసింది లేదు. వారి గోడు విన్నది లేదు. ఎమ్మెల్యేగా జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఆ జీతం సొమ్ము 50 లక్షలకు పైనే ఉందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు కూడా. ఆ ప్రకటన చూశాక.. గజ్వేల్ ప్రజల్లో అసహనం తలెత్తింది. మా పన్నులతో జీతం తీసుకుంటూ.. మా ఎమ్మెల్యేగా పదవి అనుభవిస్తూ.. మమ్మల్ని పట్టించుకోరా అంటూ.. గజ్వేల్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు స్థానికులు & మల్లన్నసాగర్ నిర్వాసితులు.

కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి టూలెట్ బోర్డు తగిలించారు. అంటే, ఆఫీసుకు కేసీఆర్ రారు కాబట్టి ఖాళీగా ఉన్నట్టే. అందుకే టూలెట్ బోర్డు పెట్టారు. వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అంటూ మరో బోర్డు కూడా గేటుకు కట్టారు. కేసీఆర్ కనిపించడం లేదు. మిస్సింగ్. అందుకే, వాంటెడ్ కేసీఆర్ అంటూ గజ్వేల్ పబ్లిక్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలతో బీజేపీ శ్రేణులు కూడా కలిసిరావడంతో.. కేసీఆర్ క్యాంప్ ఆఫీసు దగ్గర రచ్చ రచ్చ అయింది. ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. బీజేపీ కార్యకర్తలను, ప్రజలను కంట్రోల్ చేశారు.


Also Read: గేమ్ ఛేంజర్.. రేవంత్ దెబ్బకు కేసీఆర్‌కు దేత్తడి!

గజ్వేల్ ఇంత జరుగుతుంటే.. ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా స్పందించలేదు. కేసీఆర్ అంటే పార్టీ కేడర్ కు కూడా విసుగు పుట్టేసింది. తమకు అందుబాటులో ఉండని లీడర్ తమకెందుకు అనే నిర్ణయానికి వచ్చేశారు. గులాబీ బాస్ పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు గజ్వేల్ లో ఎన్నికలు వస్తే కేసీఆర్ కు డిపాజిట్ వచ్చుడు కూడా కష్టమే అంటున్నారు. అంతగా కేసీఆర్ పై వ్యతిరేకత నెలకొంది గజ్వేల్‌లో.

గజ్వేల్‌లోనే అని కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ ముఖం చూసిన వారు ఏ కొద్దిమందో. పబ్లిక్ లోకి రావాలంటే భయపడుతున్నారో.. ఓటమితో ముఖం చెల్లడం లేదే ఏమో.. కేసీఆర్ ఉనికే లేదు. అటు అసెంబ్లీలో మాట్లాడరు.. ఇటు ప్రజాక్షేత్రంలోకి రారు. గత పాలనలో జరిగిన లక్షల కోట్ల అవినీతి.. చేసిన అప్పులు.. ఫోన్ ట్యాపింగ్ అరాచకాలు.. కరెంట్, రేస్ కార్ స్కాంలు.. ఇలా ఎన్ని విమర్శలు ముంచెత్తుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఎంతగా మాటలతో అటాక్ చేస్తున్నా.. కేసీఆర్ లో మాత్రం ఉలుకూలేదు.. పలుకూలేదు. అనేది నన్ను కాదులే అన్నట్టు ఫాంహౌజ్‌లో పడుంటున్నారు. ఆయన తరఫున కేటీఆర్, హరీశ్ రావులు మైకుల ముందు మాట్లాడుతున్నా.. గత అరాచకాలపై గళం విప్పాల్సింది కేసీఆరేగా. కొడుకు, అల్లుడు కాదుగా.. అనేది అధికారపక్షం వెర్షన్. ఇలా పొలిటికల్ ఫైట్ ఎలా ఉన్నా.. ఇప్పుడు గజ్వేల్ ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తుండటం.. కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ముట్టడించడం చిన్నవిషయమేమీ కాదు. ఈ అలజడి ముందుముందు ఉప్పెనలా మారి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌పై తిరుగుబాటు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే, ఇప్పటికైనా అసెంబ్లీకైనా రండి కేసీఆర్ సారూ. సీఎం రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి బాసూ!!

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×