Tamannaah : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా (Tamannaah ). రామ్ చరణ్ (Ram Charan ను మొదలుకొని.. చిరంజీవి (Chiranjeevi) వరకు పలువురు స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పైగానే అవుతున్నా.. చెరిగిపోని అందంతో మిల్క్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది తమన్నా. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ విజయ్ వర్మ(Vijay Varma) తో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆమె సినిమాలు కూడా పెద్దగా ప్రకటించలేదు. దీంతో ఇద్దరు పెళ్లికి సిద్ధం అయిపోతున్నారు అంటూ అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని,దానికి తమన్నా పెట్టే పలు పోస్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
రూమర్స్ కి అలా చెక్ పెట్టిన తమన్నా..
దీనికి తోడు ఇలా రూమర్స్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ రూమర్స్ ని కూడా వీరు ఖండించే ప్రయత్నం చేయలేదు. దాంతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు. ఇక రూమర్స్ దావానంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో..ఎవరూ ఊహించని విధంగా సడన్ గా ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది తమన్నా. అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా తమన్న తన ఫ్రెండ్ అయినటువంటి రాషా తడాని (Rasha thadani) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ లో తమన్నా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ తో కూడిన కోట్ ధరించి ఈ అవుట్ ఫిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ పార్టీలో తమన్నా వేసుకున్న కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఇది విజయ్ కోట్ అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అంతకుముందు వీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో విజయ్ ఆ కోట్ తోనే దర్శనమిచ్చారు. దీంతో వీరు మళ్ళీ కలిసిపోయారా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరికొంతమంది ప్చ్. వాళ్లు ఇంకా విడిపోలేదా..అందుకే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది.. ఏదేమైనా ఇన్ని రోజులు బ్రేకప్ చెప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు సైలెంట్ గానే చెక్ పెట్టింది తమన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్నా కెరియర్..
ఇక తమన్నా విషయానికి వస్తే.. హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతుంది. ఇకపోతే కొత్త హీరోయిన్లు ఎక్కువగా ఇండస్ట్రీ లోకి రావడంతో తమన్నా కాస్త జోరు తగ్గించిందని చెప్పాలి. ఇక అందులో భాగంగానే ఓదెల సీక్వెల్, ఓదెల 2 లో అఘోరీ పాత్రలో కనిపిస్తోంది తమన్నా. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తుందని నెటిజన్స్ కూడా భావిస్తున్నారు. మరి తమన్నా అందరి కోరిక మేరకు వివాహం చేసుకుంటారా? లేక ఇంకొంత కాలం ఎదురు చూడమని చెబుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Bigg Boss: నాగ్‌పై సోనియా రివేంజ్… అంత సీన్ లేదు అంటూ పరువు మొత్తం తీసేసిందిగా..