BigTV English

CM Revanth Reddy: గేమ్ ఛేంజర్.. రేవంత్ దెబ్బకి కేసీఆర్ బ్యాచ్‌కు దేత్తడి!

CM Revanth Reddy: గేమ్ ఛేంజర్.. రేవంత్ దెబ్బకి కేసీఆర్ బ్యాచ్‌కు దేత్తడి!

CM Revanth Reddy: పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందట. ఈ సామెతను గుర్తు చేసుకుంటోంది తెలంగాణ సమాజం. పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టి పీడించారని భావించి.. బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారు ప్రజలు. దొర పాలనలో కల్పించిన భ్రమలన్నీ.. కాళేశ్వరం పిల్లర్‌లా కుప్ప కూలిపోతున్నాయని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గుడ్ గవర్నెన్స్‌కు ఫిదా అవుతున్నారు జనం.


పొలిటికల్ గేమ్ ఛేంజర్‌గా సీఎం రేవంత్

కులగణన. అదెలా సాధ్యం అని ప్రశ్నించిన విమర్శకులే పరేషాన్ అవుతున్నారు. తెలంగాణలో కులగణన జరిగిపోయింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించేసింది. బిల్లు పార్లమెంట్‌కు చేరింది. కులగణనలో సోషల్ ఇంజినీరింగ్‌తో పాటు పొలిటికల్ మెకానిజం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ మాటిస్తే చేసి చూపిస్తుందని తెలంగాణ సర్కార్ ప్రూవ్ చేసింది. రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కులగణనను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి.. హైకమాండ్ ముందు రేవంత్ రెడ్డి బాహుబలిగా నిలుచున్నారు. రేవంత్ పేరు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో రీసౌండ్‌ అవుతోంది.


బీసీల్లో ఐక్యత లేదనేది ఒకప్పటి మాట. లేటెస్ట్ కులగణనతో ఇప్పుడు బీసీలంతా రేవంత్ కు జై కొడుతున్నారు. కాంగ్రెస్ జెండె ఎత్తుతున్నారు. రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో హస్తం గుర్తు తఢాకా చూపించడం ఖాయం అంటున్నారు. బీసీలు బీఆర్ఎస్ వైపో, బీజేపీ వైపో చూడకుండా.. తెలంగాణలో అధిక సంఖ్యాకులైన ఆ వర్గాన్నంతా హోల్ సేల్ గా తమ వైపునకు తిప్పుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే అంటున్నారు. ఈ దెబ్బ.. కేసీఆర్‌ పార్టీకి చావు దెబ్బే..!

బీఆర్ఎస్ ఓటు బ్యాంకే టార్గెట్?

బీసీల తర్వాత యువత అత్యంత కీలకం. లేటెస్ట్‌గా రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన దళితబంధు తరహా డ్రామాలా కాకుండా.. పక్క ప్రణాళికతో, నిధుల కేటాయింపుతో ముందడుగు వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత.. 5 లక్షల మందికి 6వేల కోట్ల రుణాలు రాయితీతో ఇవ్వడమే రాజీవ్ యువ వికాసం.

ఇప్పటికే రైతు రుణమాఫీతో అన్నదాతలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఉచిత కరెంట్, 500లకే గ్యాస్ సిలిండర్.. లాంటి వరుస పథకాలతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతోంది. పాలనతో పాటు పాలిటిక్స్ లోనూ రేవంత్ దూకుడుతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోతోంది. పదునైన విమర్శలతో పాటు.. కాళేశ్వరం అవినీతి నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ స్కాం వరకూ.. గత పాలకుల పాపం పండేందుకు టైం దగ్గరపడుతోంది. రేవంత్ మాటల్లో చెప్పాలంటే.. చర్లపల్లి జైల్లో కేసీఆర్ ఫ్యామిలీకి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు రెడీ అవుతున్నాయని అనుకోవచ్చు.

ఎనీ సెంటర్.. ఎనీ టాపిక్.. రేవంత్ రెడీ…

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉంది. సరైనోడు నాయకుడైతే కాంగ్రెస్‌ను కొట్టేది ఎవడ్రా అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. రేవంత్ దూకుడుకు కేసీఆర్ ఫాంహౌజ్‌ నుంచి బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు మీడియా పులులుగానే మిగిలిపోతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతోంది. అందుకేనేమో.. సోషల్ మీడియాను, ఫేక్ న్యూస్‌నే నమ్ముకుని రాజకీయం చేస్తోంది కారు పార్టీ. వారి కారుకూతలను ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇటీవల తీన్మార్ మల్లన్న మీద రిలీజ్ చేసిన ఫేక్ వీడియోనే అందుకు ఎగ్జాంపుల్.

బీఆర్ఎస్సే కాదు.. బీజేపీని సైతం రేవంత్ రఫ్ఫాడిస్తున్నారు. పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్‌పై సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్‌గా మారారు సీఎం రేవంత్ రెడ్డి. స్టాలిన్ తరహాలోనే దక్షిణాది గొంతును ఢిల్లీకి వినిపించేలా గట్టిగా మాట్లాడుతున్నారు. రేవంత్ సూటి ప్రశ్నలకు బీజేపీ దగ్గర నో ఆన్సర్స్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కేంద్రాన్ని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బలంగా కార్నర్ చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు, ఫోర్త్ సిటీకి కేంద్ర నిధులు ఏవంటూ ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టడంలో సీఎం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రేవంత్ దెబ్బకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకున్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అందుకే, ఎనీ సెంటర్.. ఎనీ టాపిక్.. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రెడీ.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×