BigTV English

CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..

CM Revanth Reddy : అమరరాజా కంపెనీకి సహకరిస్తాం.. సీఎం రేవంత్ హామీ..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్‌ శాంతి కుమారి ఈ భేటీలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో అమరరాజా సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్దదైన లిథియం అయాన్‌ గిగా ఫ్యాక్టరీపై భేటీలో చర్చించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ అమరరాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమరరాజా కంపెనీది కీలక పాత్ర ఉందన్నారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికత ఉపయోగించే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందనన్నారు.

అనంతరం గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ..గిగా కారిడార్‌కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలసి పని చేస్తామన్నారు. రాష్ట్రంలో మా వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్నారు. విద్యుత్తు బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని గల్లా జయదేవ్ తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×