BigTV English

Xiaomi SU7 Car: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇదే!

Xiaomi SU7 Car: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇదే!

Xiaomi SU7 Car: స్మార్ట్‌ఫోన్ తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షియోమి.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టింది. అతి త్వరలోనే తన మొదటి కారు ‘Xiaomi SU7’ను మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా బీజింగ్‌లో జరిగిన స్ట్రైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అంతేకాకుండా ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు అవుతుందని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ కారుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. కంపెనీ SU7 సిరీస్‌లో SU7, SU7 ప్రో, SU7 మాక్స్ వంటి మూడు మోడళ్లను పరిచయం చేస్తుంది.


స్పెసిఫికేషన్స్..

ఈ కారు మోటార్ 21,000 rpm వరకు తిరుగుతుంది. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ వంటి రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది. సింగిల్ మోటారు వాహనం గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.. కాగా డ్యూయల్ మోటార్ సెటప్‌తో కూడిన ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 265 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. ఎంట్రీ-లెవల్ కారు BYD 73.6kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్(LFP) బ్యాటరీ 101kWh CTB(సెల్ టు బాడీ) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంచనా. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 800 కిలోమీటర్లు వెళ్తుందని సమాచారం. ఇది హైపర్‌ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×