BigTV English

SA vs IND Second Test : నిప్పులు చెరిగిన సిరాజ్.. తొలి సెషన్ లోనే సౌతాఫ్రికా ఆలౌట్..

SA vs IND Second Test : నిప్పులు చెరిగిన సిరాజ్.. తొలి సెషన్ లోనే సౌతాఫ్రికా ఆలౌట్..

SA vs IND Second Test : తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా రెండోటెస్టులో ప్రతాపాన్ని చూపిస్తోంది. తొలి సెషన్ లోనే సఫారీ జట్టును ఆలౌట్ చేసింది. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు భారత్ పేసర్లు చుక్కలు చూపించారు. 55 పరుగులకే ఆలౌట్ చేశారు.


ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ల సిక్సర్ సాధించాడు. బుమ్రా, ముఖేశ్ కుమార్ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో తొలిసెషన్ లోనే దక్షిణాఫ్రికా జట్టు 23.2 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. సఫారీ జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. కీపర్ కైల్ వెరినే (15), డేవిడ్ బెడింగ్‌హమ్(12) రెండెకల స్కోర్ సాధించారు. మిగతా బ్యాటర్లలో ఒక్కరూ కూడా 5 పరుగుల దాటలేదు. 1932 తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్టుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఇండియాపై ఏ జట్టుకైనా ఇదే అతి తక్కువ స్కోర్.


Related News

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Big Stories

×