Big Stories

Telangana Congress : హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్..

 

- Advertisement -

ghmc deputy-mayor joined congress

- Advertisement -

 

Telangana Congress: తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. చాలా మంది నేతలు కారు దిగిపోతున్నారు. హస్తం గూటికి చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది.

గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కాంగ్రెస్ లో చేరారు. ఆమె భర్త బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ స్టేట్ ఛైర్మన్ శోభన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి షాకిచ్చారు.

హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లోకి పలుపురు నేతలు చేరారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత , శోభన్ రెడ్డి దంపతులకు ఆమె కాంగ్రెస్ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమ నాయకులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.  బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై విమర్శలు గుప్పించారు.

Read More: తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. ఆరుగురికి ఛాన్స్..

కాంగ్రెస్ లో నేతలపై చేరికలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై విమర్శలు చేశారు. గులాబీ పార్టీలో అవమానాలు భరించలేక చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. తమకు కాంగ్రెస్ లోనే తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చేరిన నేతలందరికీ సరైన గౌరవం , గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News