Big Stories

Joe Root Dismissal: వివాదాస్పదంగా మారిన జో రూట్ ఎల్బీ.. డీఆర్ఎస్‌ను నిందించిన మైకేల్ వాన్..

Joe Root Dismissal
Joe Root Dismissal

Joe Root Dismissal in India vs England 4th Test(Today’s sports news): రాంచీ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో రసవత్తరంగా మారింది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అవుట్ వివాదాస్పదంగా మారింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన రూట్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. ముందుగా అంపైర్ ధర్మసేన రూట్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ రోహిత్ శర్మ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ రూట్‌ను అవుట్‌గా ప్రకటించాడు.

- Advertisement -

అయితే అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. పిచ్ వేసిన తర్వాత బంతి తిరగడంతో ట్రాజెక్టరీలో స్టంప్‌లు తప్పిపోయినట్లు అనిపించడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ దానిని అవుట్‌‌గా ప్రకటించలేదు. బౌలర్‌ ఆర్‌ అశ్విన్‌, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ సలహా మేరకు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రివ్యూకు వెళ్లాడు. బంతి కేవలం లైన్‌లో పిచ్ అవుతూ, స్వల్పంగా స్టంప్‌లను తాకినట్లు అనిపించింది. దాదాపు బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్టు కనిపించింది. కానీ బాల్ ట్రాకింగ్‌లో మాత్రం పిచింగ్ ఇన్‌సైడ్ అని చూపించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అవాక్కయ్యారు. దీంతో రూట్‌ను అవుట్‌గా ప్రకటించారు.

- Advertisement -

Read More: చరిత్ర సృష్టించన అశ్విన్.. కుంబ్లే రికార్డ్ బ్రేక్..

అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఈ డెసిషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. BBC వ్యాఖ్యానంలో దీనిని ‘షాకర్’ అని పిలిచాడు. ఆ తర్వాత, ఇంగ్లీష్ మీడియా అభిమానులు కూడా అశ్విన్ బౌలింగ్ చేస్తున్న కోణం బంతి ఇప్పటికే కొంచెం మలుపు తిరిగినందున, స్టంప్‌లపై కొట్టడం చాలా అసంభవం అని చాలా మంది ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. వాన్ మాత్రం టెక్నాలజీని తప్పుబట్టాడు. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కూడా డీఆర్ఎస్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచాడు. అంపైర్స్ కాల్స్ తమ కొంప ముంచుతుందని ఇంగ్లాండ్ క్రికెటర్లు వాపోయారు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్ రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News